23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

ఎట్టకేలకు భారత్‌లో ‘మహీంద్రా థార్ రోక్స్’ లాంచ్: ధర రూ.12.99 లక్షలే!

Mahindra Thar Roxx Launched in India At Rs.12.99 Lakh: ముందుగా మార్థా తెలుగు (Martha Telugu) పాఠకులకు భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) భారతీయ మార్కెట్లో తన 5 డోర్ వెర్షన్ థార్ (Thar) లాంఛ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంది. ఈ కొత్త కారు యొక్క డిజైన్, ఫీచర్స్ మరియు ధరల వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి వివరంగా ఇక్కడ చూసేద్దాం..

ధరలు & వేరియంట్స్

ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) పేరుతో లాంచ్ అయిన ఈ కొత్త కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎమ్ఎక్స్1 పెట్రోల్ మాన్యువల్ (MX1 Petrol MT) మరియు ఎమ్ఎక్స్1 డీజిల్ మాన్యువల్ (MX1 Diesel MT). వీటి ధరలు వరుసగా రూ. 12.99 లక్షలు మరియు రూ. 13.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). డీజిల్ వేరియంట్ ధర పెట్రోల్ వేరియంట్ ధరల కంటే ఎక్కువని తెలుస్తోంది. అంతే కాకుండా థార్ రోక్స్ అనేది సాధారణ 3 డోర్ థార్ ప్రారంభ ధర కంటే కూడా రూ. 1.64 లక్షలు ఎక్కువని స్పష్టమవుతోంది.

డిజైన్

మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన కొత్త థార్ రోక్స్ పరిమాణంలో దాని 3 డోర్ వెర్షన్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇది కొత్త గ్రిల్, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సీ ఆకారంలో ఉండే డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్ (టాప్ వేరియంట్) డ్యూయెల్ టోన్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ (మిడ్ వేరియంట్) వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది ఇంటిగ్రేటెడ్ ఫాగ్ లాంప్ హోసింగ్.. మధ్యలో ఫాక్స్ బ్రస్డ్ అల్యూమినియం బిట్స్, ఛంకీ వీల్ ఆర్చెస్.. స్టైలిష్ 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ (హై వేరియంట్) పొందుతుంది.

థార్ రోక్స్ యొక్క ముందు డోర్ దాదాపు దాని స్టాండర్డ్ థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. వెనుక డోర్ మాత్రం కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లాంప్, రియర్ వైపర్ అన్నీ కూడా కారును మరింత ఆకర్షణీయంగా చేయడంలో ఉపయోగపడతాయి.

ఫీచర్స్

మహీంద్రా థార్ రోక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా 3 డోర్ మోడల్ యొక్క అదే డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యాడ్ మీద సాఫ్ట్ టచ్ మెటీరియట్ వంటి కొన్ని ప్రీమియం ఎలిమెంట్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్లో లేత గోధుమ రంగు లెథెరెట్ సీట్లు చూడవచ్చు.

డ్యాష్‌బోర్డ్ డ్యూయెల్ టోన్ థీమ్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. టాప్ వేరియంట్ రోక్స్ మోడల్ యొక్క ముందు వరుసలో కూల్డ్ సీట్లు, యంబియాంట్ లైటింగ్, యాంబియంట్ లైటింగ్ మరియు ఫుట్‌వెల్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్క్, నాలుగు పవర్ విండోస్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, రిమోట్ ఫ్యూయెల్ ఓపెనింగ్ సెటప్ (ఈ ఫీచర్ 3 డోర్ థార్ మోడల్ కారులో లేదు) అన్నీ కూడా ఉన్నాయి.

ఇంజిన్

కొత్త మహీంద్రా థార్ రోక్స్ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 162 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 152 హార్స్ పవర్ & 330 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు వేరియంట్లు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయని తెలుస్తోంది. బహుశా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉండొచ్చని భావిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సేఫ్టీ ఫీచర్స్

మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ మాదిరిగిగా 5 డోర్ మోడల్ కూడా అన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని భావిస్తున్నాము. కాబట్టి ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉండనున్నాయి. థార్ రోక్స్ టాప్ ఎండ్ మోడల్ ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందవచ్చని సమాచారం.

Don’t Miss: మహ్మద్ సిరాజ్ రూ.3 కోట్ల కారు ఇదే.. ఫోటోలు చూశారా?
ప్రత్యర్థులు

మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ లేదా థార్ రోక్స్ కారుకు దేశీయ మార్కెట్లో ఫోర్స్ గూర్ఖా 5 డోర్ మోడల్ ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కానీ అమ్మకాలు పరంగా ఇది తప్పకుండా ఉత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. కాగా బుకింగ్స్ మరియు డెలివరీలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెల్లడి కావాల్సి ఉంది. ఇవన్నీ ఈ రోజు (ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం) వెల్లడయ్యే అవకాశం ఉంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles