మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!

Maruti Suzuki Festive Discounts: పండుగ సీజన్ మొదలైపోయింది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలంటి వారికి మారుతి సుజుకి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందిస్తుందని వెల్లడించింది. ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్ మొదలైన కార్లు ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

మారుతి బ్రెజ్జా (Maruti Brezza)

బ్రెజ్జా కొనుగోలుపైనా ఈ నెలలో గరిష్టంగా రూ.25 వేలు వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ కారు ధర దేశీయ మార్కెట్లో రూ. 8.34 లక్షల నుంచి రూ. 14.14 లక్షల మధ్య ఉంది. ఇది భారతీయ విఫణిలో మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనేట్, టాటా నెక్సాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది ఉత్తమంగా ఉండటమే కాకుండా ఉత్తమ పనితీరును కూడా అందిస్తుంది.

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R)

వ్యాగన్ ఆర్ కొనుగోలుపై కంపెనీ రూ. 35000 నుంచి రూ. 45000 తగ్గింపు అందిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క సీఎన్‌జీ కారు కొనుగోలుపైన కస్టమర్లు ఎక్కువ తగ్గింపును పొందవచ్చు. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ మరియు రూ. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది. అయితే సీఎన్‌జీ కారు మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

మారుతి స్విఫ్ట్ (Maruti Swift)

స్విఫ్ట్ కారు కొనుగోలుపైన రూ. 35000 వరకు తగ్గింపులు పొందవచ్చు. స్విఫ్ట్ సీఎన్‌జీ కారు కొనుగోలుపైన 15000 రూపాయల తగ్గింపు పొందవచ్చు. కాగా మునుపటి స్విఫ్ట్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 30000 తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ కారుపైన కంపెనీ ఇప్పుడు మంచి తగ్గింపులు ప్రకటించింది. కాబట్టి ఈ నెలలో స్విఫ్ట్ మంచి సంఖ్యలో అమ్ముడవుతుందని భావిస్తున్నాము.

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)

డిజైర్ కొనుగోలుపైన కస్టమర్ గరిష్టంగా రూ. 40 వేలు తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది కేవలం ఆటోమాటిక్ వేరియంట్స్ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది. మాన్యువల్ వేరియంట్స్ కొనుగోలుపైన కంపెనీ రూ. 25000 తగ్గింపు అందిస్తుంది. కాగా సీఎన్‌జీ వేరియంట్ కొనుగోలుపైన ఎటువంటి తగ్గింపు లభించదు. అయితే కంపెనీ డిజైర్ కారును 2024 మోడల్ రూపంలో లాంహెచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది త్వరలోనే మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10)

భారతదేశంలో ఒకప్పటి నుంచి అధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి యొక్క ఆల్టో కే10 కొనుగోలుపైనా కంపెనీ రూ. 35000 నుంచి రూ. 50000 వరకు తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన వేరియంట్స్ మీద అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారులోని 1.0 లీటర్ ఇంజిన్ ఉత్తమ పనితీరును అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ కూడా వినియోగదారులకు అనుకూలంగా ఉంటాయి.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)

ఎస్-ప్రెస్సో కొనుగోలుపైన కస్టమర్లు గరిష్టంగా రూ. 55000 తగ్గింపు అందిస్తాయి. అయితే ఎక్కువగా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ మోడల్స్ కొనుగోలుపై లభిస్తాయి. పెట్రోల్ మరియు CNG కార్ల కొనుగోలుపైనా కొంత తక్కువ డిస్కౌంట్స్ లభిస్తాయి. ఎస్-ప్రెస్సో కార్లు మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలను పొందుతూ ముందుకు సాగుతున్నాయి. కంపెనీ ఇప్పుడు అధిక తగ్గింపులను అందిస్తుండటంతో మరింతమంది కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)

మన జాబితాలో మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ సెలెరియో కొనుగోలుపై కూడా పొందవచ్చు. టాటా టియాగో కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సెలెరియో 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. సెలెరియో కొనుగోలుపైనా కస్టమర్లు రూ. 55000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సెలెరియో యొక్క టాప్ స్పెక్ వేరియంట్స్ మీద ఎక్కువ డిస్కౌంట్స్, లో స్పెక్ వేరియంట్స్ మీద కొంత కొంత తక్కువ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

Don’t Miss: వీడియోలు చేస్తూ.. రూ.18 లక్షల బైక్ కొనేసిన యువతి

గమనిక: మారుతి సుజుకి అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయు. అంతే కాకుండా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏ కారు కొనుగోలుపైన ఎంత డిస్కౌంట్ లభిస్తుంది అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.