రూ.5.49 లక్షలకే మారుతి ఇగ్నీస్ కొత్త ఎడిషన్.. పూర్తి వివరాలు ఇక్కడ

Maruti Ignis Radiance Edition Launched in India: ఇండియన్ మార్కెట్లో ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్లిన మారుతి ఇగ్నీస్ (Maruti Ignis) ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఎడిషన్ పేరు ‘రేడియన్స్’ (Radiance) ఎడిషన్. ఇది ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ విభాగంలో సరసమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

ధర

మారుతి సుజుకి రేడియన్స్ ఎడిషన్ ప్రారంభ ధరలు రూ. 5.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ కొత్త వేరియంట్‌‌ను సిగ్మా, జీటా, అల్పా అనే మూడు ట్రిమ్‌లలో అందిస్తుంది. అయితే వేరియంట్ వారీగా ధరలు వెల్లడికావాల్సి ఉంది. కాగా ఇది దాని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొంది ఉంటుంది.

అడిషినల్ యాక్ససరీస్ & ధరలు

మారుతి ఇగ్నీస్ రేడియన్స్ ఎడిషన్‌లో అడిషినల్ యాక్ససరీస్ లభిస్తాయి. సిగ్మా ట్రిమ్‌లో వీల్ కవర్లు, డోర్ వైజర్స్, క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. వీటి కోసం అదనంగా రూ. 3650 చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా అల్పా, జీటా ట్రిమ్‌లలో అడిషినల్ యాక్ససరీస్ పొందటానికి రూ. 9500 చెల్లించాలి. ఇందులో సీట్ కవర్లు, కుషన్లు, డోర్ క్లాడింగ్, డోర్ వైజర్ మొదలైనవన్నీ ఉన్నాయి.

డిజైన్

కొత్త మారుతి ఇగ్నీస్ రేడియన్స్ ఎడిషన్ చూడటానికి దాదాపు దాని స్టాండర్డ్ ఎడిషన్ మాదిరిగానే కనిపిస్తుంది. అంతే కాకుండా కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ కాకూండా పెద్దగా గమనించాల్సిన మార్పులు లేదు. కాబట్టి అదే హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, మరియు బ్రాండ్ లోగో వంటివి ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ చూపరులను ఆకర్శించడంలో ఉపయోగపడతాయి.

ఫీచర్స్

ఇక రేడియన్స్ ఎడిషన్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా ఆశాజనకమైన అప్డేటెడ్ ఫీచర్స్ ఏమీ లేదు. కాబట్టి అదే క్యాబిన్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఏసీ వెంట్స్ వంటివి ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో ప్రయాణికులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా యాంత్రికంగా కూడా ఎటువంటి మార్పులు లేదు. కాబట్టి రేడియన్స్ ఎడిషన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుందని స్పష్టమవుతోంది.

ప్రత్యర్థులు

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి సుజుకి ఇగ్నీస్ రేడియన్స్ ఎడిషన్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, సిట్రోయెన్ సీ3 వంటి వాటికీ మాత్రమే కాకుండా బ్రాండ్ యొక్క వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ మరియు బాలెనొ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రేడియన్స్ వేరియంట్ అనేది తక్కువ ధర వద్ద లభిస్తోంది, కాబట్టి మంచి అమ్మకాలను పొందవచ్చని భావిస్తున్నాము.

భారతదేశంలో మారుతి సుజుకి ప్రయాణం

మారుతి సుజుకి కంపెనీ జపనీస్ బ్రాండ్ అయినప్పటికీ ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ. 1981లో మారుతి ఉద్యోగ లిమిటెడ్‌గా ప్రారంభమైన కంపెనీ 1982లో హర్యానాలోని గురుగ్రామ్‌లో తన మొదటి ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రారంభం నుంచే భారీ వృద్ధి సాధిస్తూ ముందుకెళ్లిన ఈ కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. భారతీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో 2022 నాటికి 42 శాతం వాటాను కైవసం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే మారుతి సుజుకి ఎంత వేగంగా తన ఉనికిని చాటుకుందో అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: బాలీవుడ్ హీరోయిన్ కొరియన్ బ్రాండ్ కారు.. దీని ధర తెలిస్తే షాకవుతారు!

ప్రారంభంలో మారుతి 800 కారును లాంచ్ చేసి సంచలన అమ్మకాలు పొందిన మారుతి సుజుకి ప్రస్తుతం స్విఫ్ట్, బాలెనొ, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఆల్టో కే10, డిజైర్, ఎర్టిగా, జిమ్నీ, వ్యాగన్ ఆర్, ఎక్స్ఎల్ 6, సెలెరియో, ఎస్-ప్రెస్సో మరియు ఈకో వంటి కార్లను విక్రయిస్తూ ఉంది. ఇవన్నీ భారతీయ మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. వాహన ప్రియులను ఆకర్శించడంలో విజయం సాధిస్తున్నాయి.