Mercedes Benz: భారత్‌లో అడుగుపెట్టిన కొత్త జర్మన్ లగ్జరీ కారు – ధర ఎంతో తెలుసా?

Mercedes Benz GLS Facelift Launched: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ‘జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్‌’ (GLS Facelift) లాంచ్ చేసింది. మార్కెట్లో విడుదలైన ఈ లగ్జరీ కారు ధర, వేరియంట్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు (Variants And Price)
  • మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450 పెట్రోల్ – రూ. 1.32 కోట్లు (ఎక్స్ షోరూమ్)
  • మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 450డీ డీజిల్ – రూ. 1.37 కోట్లు (ఎక్స్ షోరూమ్)
కలర్ ఆప్షన్స్ (Colour Option)
  • అబ్సిడియన్ బ్లాక్
  • హై-టెక్ సిల్వర్
  • సోడలైట్ బ్లూ
  • సెలెనైట్ గ్రే
  • పోలార్ వైట్

డిజైన్ (Design)

గత ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ లగ్జరీ SUV ఎట్టకేలకు ఇప్పటికి మార్కెట్లో లాంచ్ అయింది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు అతిపెద్ద టాక్ పాయింట్ గ్రిల్ పొందుతుంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌లో నాలుగు క్షితిజ సమాంతర క్రోమ్ స్ట్రిప్స్, కొత్త డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (DRL), రియర్ టెయిల్ లైట్లపై కొత్త బ్లాక్ ప్యాటర్న్ సిగ్నేచర్ మరియు రీస్టైల్డ్ ఫ్రంట్ బంపర్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంటీరియర్ అపోల్స్ట్రే ఎంపికలను పొందుతుంది. అవి బ్లాక్, బేజ్ మరియు బ్రౌన్ కలర్స్. ఇవన్నీ కూడా ఫాక్స్ లెదర్‌తో పూర్తయింది. ఇందులో కొత్త స్టీరింగ్ వీల్‌ పొందుతుంది. ఇందులో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ బటన్‌లు ఉంటాయి. సుమారు 5.2 మీటర్స్ పొడవు, 1.96 మీటర్ల వెడల్పు కలిగిన ఈ కారు 360 డిగ్రీ కెమెరా మాత్రమే కాకుండా ADAS ఫీచర్స్ పొందుతుంది.

కొత్త జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ SUV హీటెడ్ అండ్ కూల్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇందులో హెడ్ రెస్ట్రెయింట్‌లు, స్థలాన్ని పెంచడానికి ముందు సీటు యొక్క కంట్రోల్స్, ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్‌లు, రెండు 11.6 ఇంచెస్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు మొదలైనవన్నీ కూడా ఇందులో లభిస్తాయి.

ఇంజన్ మరియు పవర్‌ట్రెయిన్ (Engine And Powertrain)

కొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ రెండు పవర్‌ట్రైన్‌ల ఎంపికలను పొందుతుంది. అవి 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 381 హార్స్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 367 హార్స్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు కార్లు మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడ్డాయి.

ఇందులోని హైబ్రిడ్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) అదనంగా 20 హార్స్ పవర్ బూస్ట్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేయడానికి 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తుంది. ఇది 500 మిమీ వాటార్ వేడింగ్ డెప్త్‌ను కూడా కలిగి ఉంటుంది.

ప్రత్యర్థులు (Rivals)

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో వోల్వో ఎక్స్‌సీ90, ల్యాండ్ రోవర్ డిస్కవరీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఈ బెంజ్ కారు కొంత పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

Don’t Miss: పెట్రోల్ కార్లకంటే సీఎన్‌జీ కార్ల వినియోగం పెరగటానికి కారణం ఇదేనా! ఆసక్తికర విషయాలు!!

భారతీయ మార్కెట్లో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని మెర్సిడెస్ బెంజ్ ప్రతి ఏటా కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు కూడా జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇది అద్భుతమైన అమ్మకాలు పొందుతుందని మరియు ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము. బెంజ్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరించడంతో భాగంగానే కొత్త కార్లను (ఫ్యూయెల్ & ఎలక్ట్రిక్) లాంచ్ చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది.