ఓటమి ఎరుగని దర్శకధీరుడు ‘రాజమౌళి’ కార్లు చూశారా? బెంజ్, ఆడి, వోల్వో ఇంకా..

S S Rajamouli Luxury Car Collection: తెలుగు చిత్రసీమలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు ఎవరు? అనగానే ముక్థకంఠంతో వచ్చే సమాధానం ‘ఎస్ఎస్ రాజమౌళి’ (SS Rajamouli). ఇది నిజమే.. ఎందుకంటే 2001లో విడుదలైన స్టూడెంట్ నెం.1 సినిమా నుంచి 2022లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ వరకు కూడా ఎక్కడా ఓటమి ఎరుగని ధీరుడు మన జక్కన్న. మొత్తం ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన 12 సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టేశాయి. కాగా ఇక త్వరలో ఎస్ఎస్ఎంబీ29 సినిమా రానుంది. ఇది కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాము.

సినిమాలను ఎంతో ఓర్పుతో.. సంవత్సరాలు గడిచిన ఏ మాత్రం చలించకుండా సక్సెస్ బాట పట్టించే రాజమౌళి అంటే సినిమాలు అని మాత్రమే చాలామందికి తెలుసు. అయితే ఈ కథనంలో జక్కన్న ఎలాంటి కార్లను ఉపయోగిస్తారు? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఎస్ఎస్ రాజమౌళి కార్లు

రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. బహుశా ఇది చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఈయన గ్యారేజిలో బీఎండబ్ల్యూ 7 సిరీస్, వోల్వో ఎక్స్‌సీ40, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మరియు పోర్స్చే కయెన్ వంటి కార్లు ఉన్నట్లు సమాచారం.

బీఎండబ్ల్యూ 7 సిరీస్

జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ యొక్క పాపులర్ మోడల్ 7 సిరీస్ రాజమౌళి గ్యారేజిలో ఉందని తెలుస్తోంది. దీని ధర రూ.1.82 కోట్లు వరకు ఉంటుంది. హై ఎండ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు అధునాతన డిజైన్ పొందుతుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కార్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కారును రాజమౌళి 2017లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

వోల్వో ఎక్స్‌సీ40

స్వీడన్ కార్ల తయారీ సంస్థ అయిన వోల్వో కంపెనీ యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్‌సీ40 కూడా రాజమౌళి గ్యారేజిలో ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 46.40 లక్షల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. రాజమౌళి రెడ్ కలర్ కారును ఎంపిక చేసుకున్నారు. అయితే ఇది మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 187 Bhp పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ మోడల్ ఎలక్ట్రిక్ రూపంలో కూడా లభిస్తుంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్

రాజమౌళి గ్యారేజిలోని మరో కారు రేంజ్ రోవర్ స్పోర్ట్. దీని ధర రూ. 2.39 కోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు అద్భుతమైన ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు రేంజ్ రోవర్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

రాజమౌళి రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు తెలుపు రంగులో ఉంది. ఇందులో 5.0 లీటర్ వీ8 ఇంజిన్ ఉంటుంది. ఇది 518 హార్స్ పవర్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ కారును సెలబ్రిటీలు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతోంది.

ఆడి క్యూ7

ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్ ఈ ఆడి క్యూ7. సుమారు కోటి రూపాయల ధర వద్ద లభించే ఈ కారు 2995 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 335 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు.. వాహన వినియోగదారులకు కావాల్సిన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

సినీ పరిశ్రమకు చెందిన దాదాపు చాలామంది దగ్గర మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయి. జక్కన్న (రాజమౌళి) గ్యారేజిలో కూడా ఎస్-క్లాస్ బెంజ్ కారు ఉంది. రూ. 1.77 కోట్ల ధర వద్ద లభించే ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందుతుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఈ కారు యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో వాహన వినియోగదారులకు కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

Don’t Miss: ఈ బైక్స్ కొనడం కష్టమే!.. పోనీ ఓ లుక్కేసుకోండి!

పోర్స్చే కయెన్

రాజమౌళి గ్యారేజిలోని మరో కారు పోర్స్చే కంపెనీకి చెందిన ‘కయెన్’. దీని ప్రారంభ ధర రూ. 1.36 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం లగ్జరీ కారు మాత్రమే కాదు.. స్పోర్టీ కారు కూడా. ఈ కారణంగా చాలామంది సెలబ్రిటీలు పోర్స్చే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.

లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిన ఈ కారు 2995 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 348 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 248 కిమీ. పోర్స్చే బ్రాండ్ కార్లు కేవలం రాజమౌళి గ్యారేజిలో మాత్రమే కాకుండా హృతిక్ రోషన్, నాగ చైతన్య మొదలైన సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఉన్నాయి.