సరికొత్త బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్.. బుకింగ్స్ స్టార్ట్ – లాంచ్ ఎప్పుడంటే?

New BMW CE 04 Scooter Bookings Open India: ఎలక్ట్రిక్ బైకులకు, కార్లకు భారతదేశం డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అడుగుపెట్టడానికి యోచిస్తోంది. ఇందులో భాగంగానే ‘బీఎండబ్ల్యూ సీఈ 04’ (BMW CE 04) పేరుతో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయనుంది. అయితే సంస్థ ఈ స్కూటర్ లాంచ్ చేయడానికి ముందే ఫ్రీ బుకింగ్స్ సవిక్రయించడం ప్రారంభించినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

బుకింగ్స్ & లాంచ్ వివరాలు (Bookings & Launch Details)

బీఎండబ్ల్యూ మోటోరాడ్ లాంచ్ చేయనున్న తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సీఈ 04’ కోసం కంపెనీ ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అంటే ఈ స్కూటర్ 2024 జులై 24న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. కాగా డెలివరీలు దేశీయ విఫలో అధికారికంగా లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి.

ధర (Price)

బీఎండబ్ల్యూ యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 10 లక్షల ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే నిజమయితే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బీఎండబ్ల్యూ సీఈ 04 అత్యంత ఖరీదైన స్కూటర్‌గా మారే అవకాశం ఉంది.

డిజైన్ (Design)

బీఎండబ్ల్యూ సీఈ 04 డిజైన్ ఇతర స్కూటర్ల కంటే కూడా కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి డిజైన్ కలిగిన స్కూటర్ భారతదేశంలో అడుగుపెట్టడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఈ స్కూటర్ మల్టిపుల్ యాంగ్యులర్ కట్స్ మరియు క్రీజెస్ పొందుతుంది. ముందు భాగం మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ యొక్క వీల్‌బేస్ కూడా చాలా పొడవుగా ఉంటుంది. వెనుక భాగంలో టైర్ హగ్గర్, నెంబర్ ప్లేట్ హోల్డర్ కాకుండా ఫ్యానల్ ఏవీ లేకుండా ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ (Features)

త్వరలో దేశీయ విఫణిలో లాంచ్ కానున్న కొత్త బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్.. గతేడాదే ప్రపంచ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఇది వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పెద్ద 10.25 ఇంచెస్ హై రిజల్యూషన్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది ఇంటిగ్రేటెడ్ మ్యాప్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూదిన అధునాతన ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

బ్యాటరీ మరియు రేంజ్ (Battery And Range)

లాంచ్‌కు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ 8.9 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో మోటారు 41 Bhp పవర్ మరియు 62 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 50 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ. దీనిని 2.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేసుకోవడానికి నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ స్కూటర్ ఎకో, రోడ్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. కాబట్టి యావన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Don’t Miss: సరికొత్త టెక్నాలజీతో ఎక్స్‌టర్ సీఎన్‌జీ లాంచ్ – ధర ఎంతో తెలుసా?

పరిమాణం పరంగా కొంత పెద్దగా అనిపించే ఈ స్కూటర్ 2285 మిమీ పొడవు ఉంటుంది. 855 మిమీ వెడల్పు, 11150 మిమీ ఎత్తు కలిగిన ఈ స్కూటర్ సీట్ హైట్ 780 మిమీ (దీనిని 800 మిమీ వరకు పెందుకోవచ్చు) ఉంటుంది. స్టీల్ డబుల్ లూప్ ఫ్రేమ్ మీద నిర్మించబడిన ఈ స్కూటర్ సింగిల్ బ్రిడ్జ్ టెలిస్కోపిక్ పోర్క్, వెనుక సింగిల్ సైడ్ స్వింగారమ్ వంటివి పొందుతుంది. 15 ఇంచెస్ వీల్స్ కలిగిన ఈ స్కూటర్ అత్యుత్తమ పనితీరుని అందించేలా రూపొందించబడింది. మొత్తం మీద ఈ సరికొత్త స్కూటర్ భారతీయ కస్టమర్లను ఆకర్శించడంలో సక్సెస్ సాధిస్తుందా? లేదా అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.