New Kia Carnival Sold Out And Suresh Raina Buys First Car: ఒకప్పుడు ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలు పొంది తరువాత ఉత్పత్తికి నోచుకోని కియా కార్నివాల్.. ఈ మధ్య కాలంలో మళ్ళీ దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ మోడల్ రూపంలో లాంచ్ అయింది. భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త కియా కార్నివాల్ ఇప్పటికే 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కాగా ఈ కారు డెలివరీ కోసం ఏకంగా ఒక సంవత్సరం ఎదురు చూడాల్సి ఉంది.
రూ. 63.9 లక్షల (ఎక్స్ షోరూమ్) ఖరీదైన 2024 కియా కార్నివాల్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు బ్లాక్ మరియు వైట్ అనే రెండు రంగులలో మాత్రమే లభిస్తోంది. బుక్ చేసుకున్న కస్టమర్లకు తొందరగా డెలివరీ చేయడానికి కంపెనీ ఈ కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయాలని.. ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.
భారతదేశంలో కొత్త కార్నివాల్‌కు ఉన్న డిమాండ్ చూసి కియా ఇండియా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ప్రారంభంలో అమ్మకాలు అంతంత మాత్రమే అనుకున్న కంపెనీ ఊహ తప్పని తెలిసింది. కియా కార్నివాల్ కారును ఇష్టపడే ప్రజలు చాలామందే ఉన్నట్లు స్పష్టంగా తెలిసిపోయింది.
కొత్త కియా కార్నివాల్ ధర దాని అవుట్ గోయింగ్ మోడల్ కంటే కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ.. కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ కొత్త కార్నివాల్ ‘సెమీ నాక్డ్ డౌన్’ (SKD) కిట్‌ల నుంచి ఆంధ్రప్రదేశ్ అనంతపురంలోని కియా ఇండియా ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడుతోంది. కంపెనీ ఇక్కడ నెలకు ప్రస్తుతం 300 యూనిట్లను మాత్రమే అసెంబుల్ చేయగలదు. కాబట్టి డెలివరీలు కొంత ఆలస్యమవుతాయి.
ప్రస్తుతం కియా కార్నివాల్ పొందిన బుకింగ్లను బట్టి చూస్తే ఈ కార్ల మరింత ఎక్కువ సంఖ్యలో అసెంబుల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కూడా ఈ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ అమ్మకాల పరంగా టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా వెల్‌ఫైర్ వంటి వాటితో పోటీ పడాల్సి ఉంది.
మొదలైన కియా కార్నివాల్ డెలివరీలు
ఇటీవల దేశీయ విఫణిలో లాంచ్ అయిన 2024 కియా కార్నివాల్ డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కియా కార్నివాల్ మొదటి కారును క్రికెటర్ ‘సురేష్ రైనా’ సొంతం చేసుకున్నారు. ఈయన ఫుల్లీ లోడెడ్ లిమోసిన్ ప్లస్ వేరియంట్ కొనుగోలు సీగేసారు. ఇది డ్యూయెల్ సన్‌రూఫ్, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, రెండవ వరుసలో పవర్ డోర్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
పరిమాణంలో విశాలంగా ఉన్న కియా కార్నివాల్ ఎల్ఈడీ లైటింగ్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, కాంట్రాస్టింగ్ స్కిడ్ ప్లేట్స్, వెనుక వైపు ఎల్ఈడీ లైట్ బార్ వంటివి పొందుతుంది. ఈ కారులో అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
కియా కార్నివాల్ 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 11 ఇంచెస్ హెడ్స్ ఆఫ్ డిస్‌ప్లే, 12 స్పీకర్ బోస్ సిస్టం, 12 వే పవర్ డ్రైవర్ సీటు, ముందు వరుస సీట్ల కోసం వెంటిలేషన్ మరియు హీటింగ్ వంటి వాటితో 8 వే పవర్డ్ ప్యాసింజర్ సీటు. షిఫ్ట్ బై వైర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ వంటివి పొందుతుంది. ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Don’t Miss: తండ్రికి రూ.80 లక్షల గిఫ్ట్ ఇచ్చిన కూతురు: సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్
2024 కియా కార్నివాల్ 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 190 Bhp పవర్ మరియు 441 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 14.85 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.