23.2 C
Hyderabad
Tuesday, January 21, 2025

ఒలంపిక్‌ విజేతలకు ఎలక్ట్రిక్‌ కారు గిఫ్ట్‌.. ఎవరిచ్చారంటే?

Indian Olympic Medal Winners Get MG Windsor EV Gift: ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఐదు కాంస్య పతకాలు (బ్రాంజ్ మెడల్స్), ఒక సిల్వర్ మెడల్ సాధించింది. మెడల్ గెలిచిన ప్రతి ఒక్కరికీ జేఎస్‌డబ్ల్యు చైర్మన్ ‘సజ్జన్ జిందాల్’ ఒక కారు గిఫ్ట్ ఇస్తామని గతంలోనే ప్రకటించారు. అన్నట్టుగానే ఈయన గెలిచిన క్రీడాకారులకు ఎంజీ మోటార్స్ యొక్క ‘విండ్సర్’ ఎలక్ట్రిక్ కారును (MG Windsor EV) గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారు గిఫ్ట్‌గా పొందిన క్రీడాకారుల జాబితా కింద చూడవచ్చు.

కారు గిఫ్ట్‌గా పొందిన క్రీడాకారులు

ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున షూటింగ్‌లో మొదటి మెడల్ (బ్రాంజ్ మెడల్) గెలుపొందిన మను భాకర్, మిక్స్‌డ్ 10 మీటర్లు ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్‌తో కలిసి మెడల్ గెలిచినా సరబ్‌జోత్ సింగ్, మెన్స్ 50 మీటర్లు రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో మెడల్ సాధించిన స్వప్నిల్ కుసాలే, నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్) మరియు పురుషుల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో బ్రాండ్ మెడల్ సాధించిన అమన్ సెహ్రావత్ ఉన్నారు.

వీరు మాత్రమే కాకుండా ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను ఓడించి ఇండియాకు కాంస్య పతకాన్ని అందించిన భారత హాకీ జట్టులోని సభ్యులు కూడా ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారును పొందనున్నట్లు సమాచారం. ఇందులో హర్మన్‌ ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేష్, జర్మన్ ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్ వాల్మీకి, సంజయ్, రాజ్ కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ ప్రీత్ సింగ్, హార్థిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, అభిషేక్, సుఖ్ జీత్ సింగ్, లలిక్ కుమార్ ఉపాధ్యాయ, మన్ దీప్ సింగ్ మరియు గుర్జంత్ సింగ్ వంటి మొత్తం 16 మంది క్రీడాకారులు ఉన్నారు.

జేఎస్‌డబ్ల్యు గ్రూప్ అథ్లెట్లతో, క్రీడాకారులతో మంచి సత్సంబంధం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ బెంగళూరు ఎఫ్‌సీ, ఢిల్లీ క్యాపిటల్స్, హర్యానా స్టీలర్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ టీమ్ వంటి వాటికి స్పాన్సర్‌గా వ్యవహరించడమే కాకుండా.. నీరజ్ చోప్రా, అక్షర్ పటేల్, ధృవ్ జురెల్, సాక్షి మాలిక్, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ మొదలైనవారికి కూడా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.

ఎంజీ విండ్సర్ ఈవీ

ఒలంపిక్స్ క్రీడాకారులకు అందించిన ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు భారతీయ విఫణిలో విఫణిలో 2024 సెప్టెంబర్ 11న అధికారికంగా లాంచ్ అవుతుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఇంకా డీలర్‌షిప్‌లకు చేరకముందే.. క్రీడాకారుల గ్యారేజిలో చోటు సంపాదించుకుంది.

ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు విశాలమైన మరియు ప్రీమియం ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్లు వెల్లడయ్యాయి. ఈ కారు యాంబియంట్ లైటింగ్, 135 డిగ్రీల ఎయిర్‌ప్లేన్ స్టైల్ రిక్లైనింగ్ సీట్లు, గ్లాస్ రూప్, బ్లాక్ అపోల్స్ట్రే మరియు దాని విభాగంలో అతిపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మొదలైన ఫీచర్స్ పొందుతుంది.

గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ విండ్సర్ ఈవీ బ్యాటరీ ప్యాక్స్ పొందుతుంది. అవి 50.6 కిలోవాట్ బ్యాటరీ మరియు 37.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 136 పీఎస్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న తన విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో ఎలాంటి బ్యాటరీ ఆప్షన్స్ అందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఒకే బ్యాటరీతో అందిస్తుందా? రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

Don’t Miss: ఎలక్ట్రిక్ కార్లపై మనసుపడ్డ సినీతారలు వీరే!.. ఓ లుక్కేసుకోండి

కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు, అయితే ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20 లక్షల కంటే తక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా బుకింగ్స్ మరియు డెలివరీ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కారు లాంచ్ అయిన తరువాత ఈ విభాగంలో గట్టి పోటీ ఎదుర్కోవాలి ఉంటుందని భావిస్తున్నాము. కానీ ఇప్పటికే కంపెనీ ఆధునిక వాహనాలను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. కాబట్టి సెప్టెంబర్ 11న లాంచ్ కానున్న ఎంజీ విండ్సర్ దాని విభాగంలో మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles