బుధవారం (16 ఏప్రిల్): ఈ రాశివారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

Daily Horoscope in Telugu 16th April 2025 Wednesday: బుధవారం (16 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. ఈ రోజు రాశిఫలాలు విషయానికి వస్తే..

మేషం

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, వృత్తి.. ఉద్యోగాల్లో కొంత ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.

వృషభం

కీలకమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు జరిగే అవకాశం, గొడవలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు తక్కువ. అవకాశం కోసం ఎదురు చూడండి. తప్పక ఫలితం లభిస్తుంది.

మిథునం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్ధిక పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో అదనపు భారం, అధికారుల నుంచి కొంత ఒత్తిడి పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం

స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తగదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్ధిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది.

సింహం

అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రయత్నిస్తే.. తప్పకుండా ఫలితం ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

కన్య

విందు వినోదాల్లో పాల్గొంటారు, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

తుల

సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. వివాదాలు కూడా సమసిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సహనం చాలా అవసరం.

వృశ్చికం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంటాబయట అనుకూల వాతావరణం. ముఖ్యమైన పనులకు అప్రయత్నంగానే పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. దైవ చింతన పెరుగుతుంది.

ధనుస్సు

సమస్యలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శుభయోగం. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

మకరం

జీవిత భాగస్వామితో.. ఆనందంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్ధిక పరిస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు కొంత నెమ్మగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో గందరగోళ వాతావరణం నెలకొంటుంది.

కుంభం

బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది.

మీనం

కుటుంబ సభ్యుల తీరు కొంత బాధకలిగిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. మీరు చెయ్యని పనులకు కూడా నిందలు పడాల్సి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండటం మంచిది. ఏ విషయంలో అయినా తొందరపాటు వద్దు.

గమనించండి: రాశిఫలాలు అవగాహన కోసమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. గ్రహాల స్థితిగతుల ఆధారంగా.. ఫలితాలు కూడా మారుతూ ఉండవచ్చు. కాబట్టి పైన చెప్పినవన్నీ జరుగుతాయని, లేదా జరగవని మనం నిర్దారించలేము. పాఠకులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

Leave a Comment