ఈ రాశివారికి ఇంటా బయట అనుకూలం: ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందంటే?

Daily Horoscope in Telugu 2025 March 18th Tuesday: మంగళవారం (18 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు.

మేషం

ఈ రాశివారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంది. ఇంటా బయటా వివాదాలు. ఉద్యోగ వాతావరణం కూడా గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

వృషభం

చిన్ననాటి మిత్రుల కలయిక, దూర ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మిథునం

ఆకస్మిక ధనలాభము. వ్యాపారాల్లో అనుకున్న విధానగానే లాభాలను ఆర్జిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దైవ దర్శనం చేసుకుంటారు.

కర్కాటకం

వ్యాపారాలలో ఒడిదుడుకులు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు లేవు. శ్రమకు తగిన ఫలితం లేదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు. కొన్ని ముఖ్యమైన వ్యవహాలు కూడా మందకొడిగానే సాగుతాయి.

సింహం

వృధా ఖర్చులు ఉన్నాయి. ఖర్చుకు తగిన ధనం చేకూరదు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లోనూ నిరాశ. దైవ చింతన పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. ముఖ్యమైన పనులలో జాగ్రత్తగా మసలుకోవాలి. పెద్దలు మాట వింటే శుభం చేకూరుతుంది.

కన్య

నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది. ఖర్చులు మునుపటి కంటే ఎక్కువగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి అడుగులు వేయాలి.

తుల

చిరకాల వివాదాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తికావడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం

శ్రమ ఎక్కువ.. తగిన ఫలితం లేదు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక సమస్యలు ఉన్నాయి. అవసరానికి కావలసిన ధనం లభించదు. ఉద్యోగంలో ఒత్తిడి, అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి లభించదు. ముఖ్యమైన పనులు కొంత మందకొడిగానే సాగుతాయి. దైవ దర్శనం శుభం కలిగిస్తుంది.

ధనుస్సు

ఆర్ధిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు, మాటపట్టింపు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

మకరం

సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు, బంధు మిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు. వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం

అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దూరప్రయాణాలు చేస్తారు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో కొంత విభేదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు.

మీనం

బాల్యస్నేహితులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

గమనించండి: రాశిఫలాలు అనేవి గ్రహాల స్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయమైన అధరాలు గానీ.. సాంకేతికమైన అధరాలు గానీ లేదు. రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో చెప్పినవే జరుగుతాయని, ఖచ్చితంగా జరగవని మనం నిర్దారించలేము. పాఠకులు ఈ విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.

Leave a Comment