ఈ రాశివారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి

Daily Horoscope in Telugu 2025 March 28 Friday: శుక్రవారం (మార్చి 28). శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. అమృత గడియలు ఉదయం 5:12 నుంచి 6:43 వరకు.

మేషం

ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తఅవసరం . ఉద్యోగంలో పని ఒత్తిడి. శ్రమకు తగిన ఫలితం శూన్యం. ఆర్ధిక పరిస్థితి మరింత మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు.

వృషభం

సన్నిహితులతో మాటపట్టింపు, అవసరానికి చేతికి అందాల్సిన ధనం అందదు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం పడుతుంది. జాగ్రత్తగా మసలుకోవడం ముఖ్యం.

మిథునం

దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యసిద్ధి ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి.

కర్కాటకం

ఆర్ధిక ఇబ్బందుల వల్ల చికాకు కలుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సబ్యులతో కాలం గడుపుతారు. ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ద అవసరం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.

సింహం

శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మున్ముందు ఉపయోగపడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి కొంత ఉత్తమాంగానే ఉంటుంది.

కన్య

వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధిక ఇబ్బందులున్నాయి. దైవ చింతన పెరుగుతుంది.

తుల

ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అవసరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారే సమయం ఇదే. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

వృశ్చికం

మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని మార్పులు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఖర్చులకు తగిన ధనం లభించదు. ఖర్చులు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. దైవ చింతన పెరుగుతుంది.

మకరం

కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ద తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

కుంభం

దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

మీనం

నూతన కార్యక్రమాలు చేపడతారు. అవసరానికి ధనం అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

గమనించండి: రాశిఫలాలు పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని నిర్దారించలేము. రాశిఫలాలు గ్రహాల స్థితిగతులను బట్టి కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం లేదు. పాఠకులు దీనిని గమనించాలి.

Leave a Comment