Daily Horoscope in Telugu 2025 March 7th Friday: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గుణమాసం, శిశిర ఋతువు, శుక్రవారం (2025 మార్చి 7). రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, యమగండం సాయంత్రం 3:24 గంటల నుంచి 4:52 వరకు. సూర్యోదయం 6:19, సూర్యాస్తమయం 6:03.
మేషం
ఈ రాశివారికి మంచి కాలం నడుస్తోంది. అలోచించి చేసేపనులు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాదాలకు కొంత దూరంగా ఉండాలి. బంధుమిత్రులతో గొడవలు జరిగే అవకాశం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
వృషభం
ఇంటబయట అనుకూల వాతావరణం, ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించిన వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. సన్నిహితులతో సమయం గడుపుతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగుల అసలు ఫలిస్తాయి.
మిథునం
ముఖ్యమైన వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఋణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కీలక వ్యవహారాల యందు.. ఆచి తూచి అడుగులు వేయాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆధ్యాత్మిక చింతన మాయాబలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం.
కర్కాటకం
సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన విషయాల్లో కొంత నేర్పు అవసరం. అలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహం
నూతన వాహన కొనుగోలు, ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమిస్తారు. అనవసర గొడవలకు దూరంగా ఉండాలి. దాయాదులతో ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. సన్నిహితులతో సఖ్యతతో మెలగండి.
కన్య
దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఖర్చులకు కావలసినంత ఆదాయం ఉండదు. దీర్ఘకాలిక రుణాలను తీర్చడానికి.. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలు కొంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. పనికి తగ్గ ప్రతి ఫలం శూన్యం.
తుల
శుభయోగం నడుస్తోంది. కొన్ని కీలక వ్యవహారాల్లో.. కుటుంబ సభ్యుల సలహాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇంట బయట మీ మాటలకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. స్థిరాస్తికి సంబంధించిన క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. దైవ చింతన మనోబలాన్ని ఇస్తుంది.
వృశ్చికం
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సజావుగా ముందుకు సాగవు. ఉద్యోగులకు శ్రమ తప్పా.. ఫలితం శూన్యం. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్ధిక పరిస్థిని నిరాశను కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నట్లు. కీలక విషయాల్లో.. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి.
మకరం
కొత్తగా ప్రారంభించే పనులలో మంచి వృద్ధి. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఆకాశమిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగుల పనికి ప్రశంసలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.
కుంభం
నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. వ్యాపారంలో నిరుత్సాహం. ప్రయాణాలలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సన్నిహితులతో వాదోపవాదాలు. మీ ఆలోచనలే ఈ రోజు మీకు సమస్యను తెచ్చిపెడతాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆర్ధిక పరిస్థితి మందకొడిగానే ఉంటుంది.
మీనం
కీలక విషయాల్లో.. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆర్ధిక పరమైన విషయాల్లో, ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు పనిభారం. సన్నిహితులతో మాటపట్టింపులు. దైవదర్శనం శుభం కలిగిస్తుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. పైన చెప్పినవన్నీ నిజ జీవితంలో జరగవచ్చు, జాగరకపోవచ్చు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరగాలో పరబ్రహ్మ నిర్ణయిస్తాడు. కాబట్టి దైవదర్శనం లేదా దైవ నామ స్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.