Daily Horoscope in Telugu 2025 March 8th Saturday: మార్చి 08, 2025 శనివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్ల పక్షం, పాల్గుణ మాసం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. వర్జ్యం ఉదయం 11:27 నుంచి 1:00 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:53 నుంచి 6:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు.
మేషం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువు మిత్రులతో సంతోషకరమైన వాతావరణం, అవసరానికి డబ్బు అందుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులు శుభపరిణామాలను ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సంబంధిత వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇంటా బయట అనుకూలం.
వృషభం
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడుపుతారు. సంఘంలో గౌరవ మ్నార్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం.
మిథునం
అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలు సైతం ముందుకు సాగవు. ఆర్ధిక ఇబ్బందులు, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంతానం యొక్క విద్యా, ఉద్యోగ విషయాల్లో కొంత శ్రద్ద వహించాలి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
కర్కాటకం
శ్రమ తప్పా.. ఫలితం శూన్యం. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కూడా కొంత కష్టమే. బంధువులతో మాటపట్టింపులు, నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని తెస్తాయి. జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది.
సింహం
సన్నిహితులతో సమావేశాలు, కుటుంబంలో సంతోష వాతావరణం. ఆదాయం అవసరానికి తగినట్లుగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలమైన వాతావరణం. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.
కన్య
ఈ రాశివారికి ఈ రోజు అంత అనుకూలంగాణా లేదు. చేపట్టిన పనులు అనుకున్నంత వేగంగా ముందుకు సాగవు. బంధు మిత్రులతో వాగ్వాదాలు. ధన నష్టం. వ్యాపారాలు కూడా మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగులకు.. అధికారులతో సమస్యలు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
తుల
నూతన కార్యక్రమాలకు శ్రీకారం, ఇంటా బయట అనుకూల వాతావరణం. శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి విక్రయాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం.
వృశ్చికం
తొందరపాటు నిర్ణయాలు ప్రమాదం కలిగిస్తాయి. ముఖ పరిచయం లేనివారితో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగవు. దైవారాధాన మేలు చేస్తుంది.
ధనుస్సు
నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ద్రుష్టి కేంద్రీకరిస్తారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
మకరం
సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. విద్యార్థులకు శుభయోగం.
కుంభం
చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ.. నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. బంధువులతో సరదాగా గడుపుతారు. ఎట్టిపరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
మీనం
ఉద్యోగులకు స్థాన చలనం ఉంది. వ్యాపారంలో గందరగోళ పరిస్థితి. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాటపట్టింపు ఉన్నవి. ఆవేశం పనికిరాదు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవారాధన శుభం చేకూరుస్తుంది.
Also Read: తల్లికి కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – వీడియో చూశారా?
గమనించండి: రాశిఫలాలు అనేది కేవలం అవగాహనా కోసం మాత్రమే. కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. అయితే గ్రహాల స్థితిగతుల దృష్ట్యా ఫలితాలు వస్తాయన్నది వాస్తవం. అయితే అన్నీ జరుగుతాయా? జరగవా? అనేది దైవేచ్ఛ.