26.2 C
Hyderabad
Friday, January 17, 2025

Country Code: భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..

Reason Behind India Country Code 91 Before Mobile Number: భారతదేశంలో ఏ మొబైల్ నెంబర్ అయినా +91 అనే కోడ్‌తోనే స్టార్ట్ అవుతుందని అందరికి తెలుసు. అయితే ఇదే నెంబర్ కోడ్‌తో ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఈ కోడ్ మన దేశానికి ఎవరు నిర్ణయించారు. కోడ్ అనేది ఎవరు నిర్ణయిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మనం రోజు ఉపయోగించే మొబైల్ ఫోన్‌కు ఏదైనా కాల్ వచ్చినప్పుడు.. అంకెల ముందు +91 లేదా ఇతర కోడ్స్ వంటివి రావడం గమనించవచ్చు. అయితే మన దేశానికి మాత్రం +91 కోడ్ నిర్థారించారు. నిజానికి కంట్రీ కాలింగ్ కోడ్ లేదా కంట్రీ డయల్ ఇన్ కోడ్స్ టెలిఫోన్ నెంబర్లకు ప్రీఫిక్స్‌లుగా ఉపయోగిస్తారు. దీని సాయంతోనే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సభ్యులు లేదా టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లకు కనెక్ట్ చేయవచ్చు.

కంట్రీ డయల్ కోడ్ ఎవరు నిర్ణయిస్తారు?

మనదేశానికి +91 కోడ్ ఉన్నట్లుగానే.. దాయాది దేశమైన పాకిస్తాన్ కోసం +92 అనే కోడ్ నిర్థారించారు. వీటినే ఇంటర్నేషనల్ సబ్‌స్క్రైబర్ దయిలింగ్ అని పిలుస్తారు. ఈ కోడ్స్ అన్నింటిని ఆయా దేశాలకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటనేషనల్ తిలికమ్యూనికేషన్ యూనియన్ కేటాయిస్తుంది. కోడ్ +91 అనేది 1960లలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ద్వారా భారతదేశానికి కేటాయించబడింది.

 

ITU ఎప్పుడు ఏర్పడింది?

ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న ఒక ప్రత్యేకమైన ఏజన్సీ. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సమస్యల నివారణపై పనిచేస్తుంది. ఇది 1865 వ సంవత్సరం మే 17న ఇంటర్నేషనల్ టెలిగ్రాఫిక్ యూనియన్‌గా స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఈ యూనియన్‌లో మొత్తం 193 దేశాలు ఉన్నట్లు సమాచారం.

ప్రపంచం మొత్తం 9 జోన్లుగా..

ఒక దేశానికీ కంట్రీ కోడ్ ఇవ్వడం కూడా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్‌లో ఒక భాగం. ఐటీయూకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ ప్రపంచంలోని అన్ని దేశాలను మొత్తం 9 జోన్లుగా విభజించింది. ఈ జోన్ ఆధారంగానే కంట్రీ డయల్ కోడ్ రూపొందించడం జరుగుతుంది.

తొమ్మిదవ జోన్ కింద ఉన్న దేశాలు

దేశ జనాభా.. ఆర్ధిక వ్యవస్థ, కమ్యూనికేషన్ సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కోడ్‌లను ఐటీయూ నిర్థారిస్తుంది. సౌత్, మిడిల్ మరియు పశ్చిమాసియాతో పాటు.. మధ్య ప్రాచ్య దేశాలన్నీ తొమ్మిదో జోన్ కిందికి వస్తాయి. తొమ్మిదో జోన్ కింద ఉన్న అన్ని దేశాల కోడ్స్ 9తోనే ప్రారంభమవుతాయి. కాబట్టి భారతదేశానికి +91, పాకిస్తాన్‌కు +92, ఆప్ఘనిస్తాన్ +93 మరియు శ్రీలంక +94 కోడ్స్ పొందాయి.

దేశానికి కేటాయించబడిన కోడ్స్.. ఒక దేశం నుంచి మరో దేశానికి కాల్ చేసినప్పుడు ఉపయోగించబడతాయి. అయితే దేశంలోని మొబైల్ నెంబర్లకు కాల్ చేసే సమయంలో వీటిని ఉపయోగించడం తప్పనిసరి కాదు. ఎందుకంటే కాల్ చేసినప్పుడు కంట్రీ కోడ్ ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. ఈ కోడ్ ఆధారంగా ఏ కాల్ ఏ దేశం నుంచి వస్తోంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

ఇప్పటి వరకు చాలామంది మొబైల్ ఫోనుకు కాల్ వచ్చినప్పుడు +91 గమనించినప్పటికీ.. దాని గురించి పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు.. లేదా దాని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ కథనం జదివిన తరువాత +91 ఎందుకు వస్తుంది. ఇది ఎప్పుడు ఉపయోగించబడుతుంది. ఎవరు నిర్థారిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం దొరికి ఉంటుంది. ఇలాంటి విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేకుంటే ఎప్పటికి సమాధానం లభించని ప్రశ్న మాదిరిగానే మిగిలిపోతుంది.

దేశంలోని ప్రధాన నగరాలకు కోడ్స్..

కొంత సేపు కంట్రీ కోడ్ విషయాన్ని పక్కన పెడితే.. మన దేశంలో కొన్ని ప్రధాన నగరాల నుంచి కాల్ వచ్చినప్పుడు కూడా వాటికి సిమిలర్ నెంబర్ ఒకటి వస్తుంది. వీటిని ల్యాండ్ లైన్ కోడ్స్ అంటారు. ఉదాహరణ మనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తే.. నెంబర్ ముందు 040 అనే సంఖ్య చూడవచ్చు. అదే విధంగా ఢిల్లీ నుంచి కాల్ వస్తే 011 అని కోడ్ కనిపిస్తుంది. ఇవన్నీ దేశంలోని వివిధ ప్రాంతాలను తెలియజేయడానికి ఉపయోగపడతాయి. కానీ +91 అనేది దేశం మొత్తానికి కేటాయించబడి ఉంటుంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles