Safest Tata Cars in India From Punch EV To Safari: ఆధునిక కాలంలో కార్లను కొనుగోలు చేసేవారిలో చాలామందికి మైలేజ్ మాత్రమే కాకుండా.. సేఫ్టీ ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప;యూ కార్ల తయారీ సంస్థలు.. తమ కార్లలో కట్టుదిట్టమైన భద్రతా ఫీచర్స్ అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ బ్రాండ్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ అంటే నమ్మకానికి అమ్మ వంటిదని అందరికి తెలుసు. క్రాష్ టెస్టులో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందిన మరియు మెరుగైన పనితీరును అందించే టాటా కార్లను గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి టాటా పంచ్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, టాటా నెక్సాన్, టాటా హారియార్, టాటా సఫారీ మరియు టాటా ఆల్ట్రోజ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా చైల్డ్ సేఫ్టీలో, అడల్ట్ సేఫ్టీలో ఉత్తమ స్కోర్ సాధించాయి. కాబట్టి దేశీయ మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవెల్ మోడల్ పంచ్ ఈవీ.. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ.. 45 పాయింట్లు సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 31.46 పాయింట్లు సాధించింది. ఇలా సేఫ్టీలో మొత్తం మీద 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన క్రాష్ టెస్టులో అత్యధిక స్కోర్ సాధించిన కారుగా టాటా పంచ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
టాటా పంచ్ ఈవీ అనేది ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రత్యేక ప్లాట్‌ఫారమ్ అయిన టాటా యాక్టి.ఈవీ ప్లాట్‌ఫారమ్ మీద ఆధారపడి రూపొందించబడిన కారు. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోహాదారులకు మంచి రక్షణ అందిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్. ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్ వంటి ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
పంచ్ ఈవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్ 25 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 35 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 421 కిమీ రేంజ్ అందిస్తుంది. బేస్ వేరియంట్స్ అయిన స్మార్ట్ మరియు స్మార్ట్ ప్లస్ వేరియంట్స్ మినహా మిగిలిన అన్ని వేరియంట్లు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తాయి. ఈ కారు ధరలు రూ. 9.99 లక్షల నుంచి రూ. 14.29 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా కర్వ్ ఈవీ కూడా సేఫ్టీలో ఉత్తమ స్కోరింగ్ సాధించి.. అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో ఈ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.81 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 49 పాయింట్లకు 44.83 పాయింట్లు సాధించి బెస్ట్ సేఫ్టీ కార్లలో ఒకటిగా నిలిచింది.
టాటా కర్వ్ ఈవీ.. క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఎంపవర్డ్ ప్లస్ మరియు ఎంపవర్డ్ ప్లస్ ఏ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 45 కిలోవాట్ మరియు 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ పొందుతుంది. 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ మరియు ఎంపవర్డ్ ప్లస్, ఎంపవర్డ్ ఏ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు దేశీయ మార్కెట్లో రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
టాటా హారియార్ / సఫారీ (Tata Harrier / Safari)
అత్యుత్తమ సేఫ్టీ కార్ల జాబితాలో టాటా సఫారీ మరియు హారియార్ రెండూ ఉన్నాయి. ఈ కార్లు అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు 30.08 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 4 పాయింట్లకు 44.54 పాయింట్లు సాధించాయి. ఈ రెండు కార్లు గత ఏడాది ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ అయ్యాయి. 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ద్వారా 170 పీఎస్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఈ మోడల్స్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి.
టాటా హారియార్ మొత్తం 25 వేరియంట్లలో లభిస్తుంది. సఫారీ కారు.. డార్క్ ఎడిషన్‌తో కలిపి 29 వేరియంట్లలో లభిస్తుంది. హారియార్ ధరలు రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ఉన్నాయి. సఫారీ ధరలు రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.89 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.