Prabhas Car Collection: పాన్‌ ఇండియా స్టార్‌ ఇక్కడ.. కార్ల జాబితా పెద్దదే!

Salaar Hero Prabhas Car Collection: 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మించిన అభిమానుల మనసు దోచాడు. ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాడు. సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ప్రభాస్‌కు ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే కూడా మహా ఇష్టం. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి.

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం (రూ. 100) తీసుకునే ప్రభాస్.. ఇటాలియన్, జర్మన్, బ్రిటన్, అమెరికా వంటి ఖరీదైన అన్యదేశ్య కార్లను తన గ్యారేజిలో కలిగి ఉన్నారు.

లంబోర్ఘిని అవెంటడోర్ (Lamborghini Aventador)

ప్రపంచ మార్కెట్లో ఖరీదైన ఇటాలియన్ కారుగా ప్రసిద్ధి చెందిన ‘లంబోర్ఘిని అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌’ ప్రభాస్ గ్యారేజిలో ఉంది. రూ. 6 కోట్ల విలువైన ఈ కారు చూడగానే ఆకర్శించబడే నారింజ రంగులో ఉంది.అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇందులో 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 770 పీఎస్ పవర్ మరియు 720 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (Land Rover Range Rover)

భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే ‘ల్యాండ్ రోవర్’ కంపెనీకి చెందిన ‘రేంజ్ రోవర్’ కూడా ప్రభాస్ గ్యారేజిలో ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 80 లక్షల వరకు ఉంటుందని సమాచారం. శాంటోరిని బ్లాక్ కలర్ కలిగిన ఈ కారు 4.4 లీటర్ వీ8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్ మరియు 740 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom)

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన, అత్యంత లగ్జరీ ఫీచర్స్ కలిగిన ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ ప్రభాస్ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 8 కోట్ల ఖరీదైన ఈ మోడల్ ప్రభాస్ గ్యారేజిలోని అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు 6.75 లీటర్ వీ12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్ మరియు 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

జాగ్వార్ ఎక్స్‌జె (Jaguar XJ)

హీరోగా నిలదొక్కుకున్న తరువాత ప్రభాస్ కొనుగోలు చేసిన మొదటి ఖరీదైన కారు జాగ్వార్ కంపెనీకి చెందిన ‘ఎక్స్‌జె’. దాదాపు రూ. 1 కోటి ఖరీదైన ఈ కారు సిల్వర్ క‌ల‌ర్‌లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది బహుశా బ్రాండ్ యొక్క నాల్గవ జనరేషన్ అని తెలుస్తోంది. ఇందులో 3.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్5 కూడా ప్రభాస్ గ్యారేజిలో కనిపిస్తుంది. రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. కంపెనీకి చెందిన ఈ కారు సెకండ్ జనరేషన్ అని తెలుస్తోంది. ఇందులో 3.0 లీటర్ స్ట్రెయిట్ సిక్స్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 255 పీఎస్ పవర్ మరియు 560 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

Don’t Miss: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

ఖరీదైన కార్లను ఇష్టపడే సెలబ్రిటీలు

అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించడం అంటే సెలబ్రిటీలకు చాలా ఇష్టం. ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అక్కినేని నాగ చైతన్య, జూనియర్ ఎన్ఠీఆర్ వంటి హీరోలు మాత్రమే కాకుండా సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, మమతా మోహన్ దాస్, తమన్నా భాటియా మొదలైన హీరోయిన్స్ కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సినీ రంగంలో కార్లను సంఖ్య చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.