లగ్జరీ కారు కొన్న స్టార్‌ హీరో బాడీగార్డ్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు!

Salman Khan Bodyguard Shera Buys Range Rover Sport: ఎప్పుడైనా ఖరీదైన కార్లను సెలబ్రిటీలు లేదా క్రికెటర్లు, ఇతర పారిశ్రామిక ప్రముఖులు కొనుగోలు చేస్తారని గతంలో చాలా కథనాల ద్వారా తెలుసుకున్నాం. అయితే ఇటీవల ఓ బాడీగార్డ్ ఏకంగా రూ. 1.7 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ బాడీగార్డ్ ఎవరు? అతడు కొన్న కారు ఏది అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. రండి.

సల్మాన్ ఖాన్ బాడీగార్డ్

అందరూ ముద్దుగా సల్లూభాయ్ అని పిలుచుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఎక్కడికెళితే అక్కడ ఇతడు కూడా ప్రత్యక్షమవుతాడు. ఆయనే ‘షేరా’. ఇతని అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. ఈయన ఇప్పుడు రూ. 1.7 కోట్ల (ఆన్‌రోడ్ – ముంబై) ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు.

షేరా కొత్త ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’ (Range Rover Sport) కారును కొనుగోలు చేసిన తరువాత, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలను షేర్ చేస్తూ.. దేవుని ఆశీర్వాదంతో కొత్త సభ్యునికి (కారుకు) ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నాము అంటూ పేర్కొన్నారు. ఇది చూసి అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు చెబుతున్నారు.

బాడీగార్డ్ ఇంత ఖరీదైన కారు కొనడం సాధ్యమేనా?

ఇటీవల కాలంలో బాడీగార్డ్ జీతాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. రాజకీయం నాయకులు, సినీ ప్రముఖులు.. తమ అంగరక్షకులు (బాడీగార్డ్స్) లక్షల జీతాలు ఇస్తున్నారు. బాడీగార్డులలో ఎక్కువ జీతం తీసుకునేవారిలో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఒకరు. అంతే కాకుండా షేరా టైగర్ సెక్యూరిటీ పేరుతో.. ఓ సెక్యూరిటీ ఏజన్సీ నడుపుతున్నాడు. దీనివల్ల కూడా ఆయనకు ఎక్కువ డబ్బు వస్తుంది. ప్రముఖులు ముంబై నగరాన్ని సందర్శించినప్పుడు ఎక్కువగా టైగర్ సెక్యూరిటీని నియమించుకుంటారు.

షేరా కేవలం బాడీగార్డ్, సెక్యూరిటీ ఏజన్సీ స్థాపకుడు మాత్రమే కాదు. ఇతడు 2019లో ముంబైలోని శివసేన పార్టీలో చేరారు. ఈ విధంగా ఈయన అన్నిరకాలుగా, వివిధ మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. మొత్తం మీద బాడీగార్డులు జాబితాలో అత్యంత సంపన్నుడు షేరా అని తెలుస్తోంది.

రేంజ్ రోవర్ స్పోర్ట్

భారతదేశంలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో స్థానం సంపాదించుకున్న బ్రాండ్లలో చెప్పుకోదగ్గది రేంజ్ రోవర్. ఇప్పడూ సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ‘షేరా’ గ్యారేజిలో కూడా స్థానం సంపాదించేసింది. ఈ కారు కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. అయితే కంపెనీ తన కార్లను దేశీయ విఫణిలోనే అసెంబుల్ చేసింది. దీంతో ఈ కారు ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి ఈ కారు రేటు ఇండియన్ మార్కెట్లో రూ. 1.4 కోట్లు (ఎక్స్ షోరూమ్). దిగుమతి చేసుకుంటే దీని ధర చాలా ఎక్కువ ఉంటుంది.

నిజానికి కంపెనీ స్థానికంగా అసెంబుల్ చేసిన ఈ కారు యొక్క డెలివరీలను 2024 ఆగష్టు 16న ప్రారంభించింది. ఇందులో మొదటి బ్యాచ్ కొనుగోలుదారుల జాబితాలో షేరా కూడా ఒకరుగా ఉన్నారు. ల్యాండ్ రోవర్ గత ఏడాది మరియు ఈ సంవత్సరం 404 యూనిట్ల రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లను విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్ల ధరలు ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టడంతో సేల్స్ పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు.

ఫీచర్స్

ఇండియన్ మార్కెట్లో అసెంబుల్ చేయబడిన రేంజ్ రోవర్ స్పోర్ట్ అనేది డైనమిక్ ఎస్ఈ వేరియంట్ రూపంలో లభిస్తుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. అవి హీటింగ్ అండ్ వెంటిలేషన్ పవర్ ఫ్రంట్ సీట్లు, పవర్ ఆఖ్డ్జస్టబుల్ రిక్లైన్ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్ రియర్ సీటు, 11.4 ఇంచెస్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సీటు, 3డీ సరౌండ్‌తో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టం మరియు 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి.

Don’t Miss: నాగార్జున వాడే కార్లు చూస్తే మతి పోవాల్సిందే!.. ఒక్కొక్కటి ఎన్ని కోట్లో తెలుసా?
రెండు ఇంజిన్ ఆప్షన్స్

భారతదేశంలో అసెంబుల్ చేయబడి రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 3 లీటర్ వీ6 టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్. ఇది 346 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. రెండో ఇంజిన్ 3 లీటర్ వీ6 టర్బోచార్జ్డ్ పెట్రోల్. ఇది 394 Bhp పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి.