Salman Khan’s Bodyguard Shera Buys Mahindra Thar Roxx: గత కొన్నిరోజులకు ముందు కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా సింగ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో కారును తన కొడుకు కోసం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేరా కొడుకు అబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
షేరా సింగ్ తన కొడుకు అబీర్ కోసం కొనుగోలు చేసిన కారు మహీంద్రా థార్ రోక్స్ అని తెలుస్తోంది. షేరా మరియు అబీర్ ఇద్దరూ ఈ కారును డెలివరీ తీసుకున్నారు. ఫోటోలను షేర్ చేస్తూ.. అన్నింటికీ థాంక్స్ నాన్న.. గాడ్ బ్లెస్‌యూ అని పేర్కొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొడుక్కి కొత్త కారు కొనిచ్చిన షేరాను పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.
మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx)
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన థార్ రోక్స్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న థార్ 3 డోర్ మోడల్ యొక్క అప్డేటెడ్ వెర్షన్. అయితే ఇది 5 డోర్స్ కలిగి.. 3 డోర్ కారు కంటే కూడా పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఈ కారు లాంచ్ అయిన తరువాత కొన్ని రోజులకు కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ స్వీకరించడం మొదలైన కేవలం 60 నిమిషాల్లో ఇది ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.
థార్ రోక్స్ యొక్క డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీలు పూర్తయినట్లు సమాచారం. కాగా మిగిలిన డెలివరీలను కూడా కంపెనీ వేగంగా పూర్తి చేస్తుందని భావిస్తున్నాము. ఇది కొత్త డిజైన్ కలిగి, చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. షేరా కొనుగోలు చేసిన మహీంద్రా థార్ రోక్స్ ఎవరెస్ట్ వైట్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు. ఇది బ్రాండ్ యొక్క టాప్ ఎండ్ మోడల్ 4×4 వేరియంట్ అని తెలుస్తోంది.
కొత్త మహీంద్రా థార్ రోక్స్ కారు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్, మల్టి జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, లేన్ కీప్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.
అద్భుతమైన ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందించే మహీంద్రా థార్ రోక్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 2.2 లీటర్ ఎంహాక్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 172 Bhp పవర్ మరియు 370 Nm టార్క్ అందిస్తుంది. 2.0 లీటర్ ఎంస్టాలిన్ సిరీస్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 174 Bhp పవర్ మరియు 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మహీంద్రా థార్ రోక్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ రెండూ కూడా మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. దేశీయ విఫణిలో మహీంద్రా థార్ రోక్స్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి మొదలై రూ. 22.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి.
Don’t Miss: టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్: పండుగ సీజన్‌లో ఓ మంచి ఎంపిక
‘మహీంద్రా థార్’కు ఎందుకంత డిమాండ్!
నిజానికి భారతదేశంలో అన్ని కార్లకు మంచి డిమాండ్ ఉంది. చిన్న కార్ల దగ్గర నుంచి లగ్జరీ కార్ల వరకు, ఆయా విభాగాల్లో ఆసక్తి కలిగిన ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆధునిక కాలంలో ఆఫ్-రోడ్ వాహనాలను వినియోగించేవారి సంఖ్య కొంత ఎక్కువైంది. ఆఫ్ రోడర్స్ రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. కఠినమైన రహదారుల్లో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఇందులో ఇప్పుడు ప్రధానంగా మహీంద్రా థార్, మారుతి జిమ్నీ, ఫోర్స్స్ గూర్ఖా వంటి కార్లు ఉన్నాయి. అయితే ఇందులో థార్ మాత్రం అధిక ప్రజాదరణ పొందుతోంది. ఎక్కువమంది థార్ కారును ఇష్టపడటానికి తక్కువ ధర, పర్ఫామెన్స్ వంటి అనేక కారణాలు ఉన్నాయి.