31.2 C
Hyderabad
Saturday, March 22, 2025

జాన్ అబ్రహంకు షారుక్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఇదే!.. ధర రూ.17 లక్షలు

Shahrukh Khan Gifted To John Abraham A New Suzuki Hayabusa: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలు ఖరీదైన బైకులు మరియు కార్లను కొనుగోలు చేస్తారని అందరికి తెలుసు. బైక్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘జాన్ అబ్రహం’ (John Abraham). ధూమ్ సినిమాలో కనిపించిన ఈ నటుడికి బైకులంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే తన గ్యారేజిలో లెక్కకు మించిన ఖరీదైన బైకులను కలిగి ఉన్నారు. ఈయన గ్యారేజిలోని ‘సుజుకి హయబుసా’ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

బైకులంటే విపరీతంగా ఇష్టపడే జాన్ అబ్రహంకు నటుడు షారుక్ ఖాన్ ఖరీదైన సుజుకి హయబుసా బైక్ గిఫ్ట్ ఇచ్చారు. గత ఏడాది పఠాన్ సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాక షారుక్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జాన్‌కు బహుమతిగా హయాబుసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా షారుక్ ఇచ్చిన బైక్ జాన్ అబ్రహం గ్యారేజిలో చేరింది.

సుజుకి హయబుసా (Suzuki Hayabusa)

భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకులలో సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి చెందిన ‘హయబుసా’ ఒకటి. ఈ బైక్ ధర రూ. 16.91 లక్షలు (ఎక్స్ షోరూమ్). ధర అనేది నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ బైక్ చూడటానికి చాలా హుందాగా ఉంటుంది. అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది.

సుజుకి హయబుసా బైక్ 1340 సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 పీఎస్ పవర్ మరియు 150 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇప్పటికే ఎక్కువ మంది సెలబ్రిటీలను ఆకర్శించిన ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ మరియు ఫీచర్స్ పొందుతుంది. మార్కెట్లో విక్రయానికి ఉన్న ఈ బైక్ కంప్లీట్ నాక్డ్ డౌన్ (సీకేడీ) యూనిట్‌గా ఇండియాకు దిగుమతి అవుతుంది.

జాన్ అబ్రహం అనేక సందర్భాల్లో సుజుకి హయబుసా రైడ్ చేసిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ బైక్ మెటాలిక్ మ్యాట్ స్వోర్డ్ అండ్ క్యాండీ డేరింగ్ రెడ్ కలర్ ఆప్షన్ పొందింది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రైడింగ్ చేసేవారికి ఈ బైక్ అత్యుత్తమ ఎంపిక అనే చెప్పాలి. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఈ బైకును ఎక్కువమంది సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేరు.

నటుడు జాన్ అబ్రహం గ్యారేజిలోని బైకులు

జాన్ అబ్రహం గ్యారేజిలో సుజుకి హయబుసా బైక్ మాత్రమే కాకుండా.. యమహా వీ-మ్యాక్స్, హోండా సీబీఆర్1000ఆర్ఆర్-ఆర్, యమహా వైజెడ్ఎఫ్-ఆర్1, డుకాటీ పానిగేల్, ఎంవీ అగస్టా ఎఫ్3 800, బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్, ఏప్రిలియా, ఆర్ఎస్వీ4 మరియు సుజుకి జీఎస్ఎక్స్-1000ఆర్ బైక్స్ ఉన్నాయి.

యమహా ఆర్డీ350, కేటీఎమ్ 390 డ్యూక్, రాజ్‌పుతానా కస్టమ్స్ లైట్‌ఫుట్, బుల్ సిటీ కస్టమ్స్ అకుమా మరియు యమహా ఎఫ్‌జెడ్ వీ2 బైకులు కూడా జాన్ అబ్రహం గ్యారేజిలో ఉన్నాయి. ఇవన్నీ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి. రైడింగ్ చేయడానికి ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.

బైకులు మాత్రమే కాకుండా జాన్ అబ్రహం గ్యారేజిలో ఇసుజు వీ-క్రాస్, నిస్సాన్ జీటీ-ఆర్ వంటి కార్లు కూడా ఉన్నాయి. జాన్ అబ్రహం తన బాంద్రా నివాసం చుట్టూ బైకులు రైడ్ చేస్తూ చాలాసార్లు కనిపించారు. అంతే కాకుండా జాన్ అబ్రహం ఏప్రిలియా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఇందులో భాగంగా ఈయన ఏప్రిలియా ఆర్ఎస్457 బైక్ కూడా కొనుగోలు చేశారు. గతంలో జాన్ అబ్రహం జపాన్ బ్రాండ్ యమహా బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించారు.

Don’t Miss: పండుగ సీజన్‌లో కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు!

1972 జనవరి 17న జన్మించిన జాన్ అబ్రహం నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పటికే నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా అబ్రహం 2017 నుంచి ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నారు. ప్రారంభంలో ఈయన మోడలింగ్ కెరీర్ ప్రారంభించిన తరువాత 2003 జిస్మ్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు