Skoda Slavia కొత్త ఎడిషన్ – కేవలం 500 మందికి మాత్రమే..

Skoda Slavia Style Edition launched in India: చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా (Skoda) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. స్కోడా లాంచ్ చేసిన కొత్త ఎడిషన్ పేరు ‘స్లావియా స్టైల్ ఎడిషన్’ (Slavia Style Edition). ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు ధర వంటి ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర (Slavia Style Edition Price)

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ‘స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్’ ధర రూ. 19.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త ఎడిషన్ స్లావియా టాప్ ఎడిషన్ కంటే కూడా రూ. 30000 ఎక్కువ. అయితే కంపెనీ ఈ కారుని కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. కావున ఈ కారును కేవలం 500 మంది కస్టమర్లు మాత్రమే ఈ కారును కొనడానికి వీలుపడుతుంది.

స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్‌ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోర్నాడో రెడ్ కలర్స్. ఇప్పటికే స్లావియా మ్యాట్ ఎడిషన్, ఎలిగాన్స్ ఎడిషన్ మరియు లావా బ్లూ ఎడిషన్ వంటి ప్రత్యేక ఎడిషన్‌లను పొందింది.

డిజైన్ (Skoda Slavia Style Edition Design)

కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ చూడటానికి మంచి డిజైన్ కలిగి అద్భుతంగా ఉంటుంది. స్టైల్ ఎడిషన్ యొక్క వింగ్ మిర్రర్స్, బీ పిల్లర్లు మరియు రూఫ్ వంటివి బ్లాక్ అవుట్ చేయబడ్డాయి. బీ పిల్లర్ మరియు స్టీరింగ్ వీల్‌పై ‘ఎడిషన్’ బ్యాడ్జింగ్ మరియు స్కఫ్ ప్లేట్‌లపై ‘స్టైల్’ బ్రాండింగ్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ (Slavia Style Edition Features)

స్కోడా స్లావియా స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే స్లావియాలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇందులో డ్యూయల్ డ్యాష్‌బోర్డ్ కెమెరాను అందించారు. ఈ ఫీచర్ వోక్స్‌వ్యాగన్ టైగన్ ట్రైల్ ఎడిషన్‌లో పరిచయం చేయబడింది. ఈ ఫీచర్ మాత్రమే కాకుండా స్లావియా స్టైల్ ఎడిషన్‌లో సన్‌రూఫ్, పవర్డ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఇంజిన్ (Slavia Style Edition Engine)

కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ ఒకే పవర్‌ట్రెయిన్ ఎంపికతో అందుబాటులో ఉంటుంది. అదే 1.5 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 150 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ DSG ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది కేవలం 8.96 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ప్రత్యర్థులు (Slavia Style Edition Rivals)

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ‘స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్’ ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ వెర్నా , ఫోక్స్‌వ్యాగన్ వర్టస్, హోండా సిటీ మరియు మారుతి సియాజ్ వంటి మిడ్ సైజ్ సెడాన్‌లకు ప్రత్యర్థిగా ఉంది. కావున అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: BYD Seal EV: భారత్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ – సింగిల్ చార్జితో 650 కిమీ రేంజ్..

స్కోడా కంపెనీ లాంచ్ చేసిన కొత్త కారు స్టైల్ ఎడిషన్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. అయితే మార్కెట్లో రోజు రోజుకి కొత్త కొత్త కార్లు పుట్టుకొస్తున్న సమయంలో ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అయితే ఈ ఆధునిక ఎడిషన్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.