Tag: Skill Development

  • ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    Andhra Pradesh Job Creation: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం అత్యంత కీలకమని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆ దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు వీలుగా యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడానికి తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ బృహత్తర ప్రణాళికకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం: సాంకేతికత, నైపుణ్యం ప్రధానం

    రాష్ట్ర సచివాలయంలో నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యా శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, దీనికి అనుగుణంగా ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని నైపుణ్యాభివృద్ధి శాఖకు స్పష్టం చేశారు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత జాబ్ పోర్టల్

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిజ్ఞానాన్ని ఉపయోగించి, రాష్ట్రం, దేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో తెలుసుకుని, ఆ సమాచారంతో ఒక ప్రత్యేకమైన జాబ్ పోర్టల్‌ను రూపొందించాలని సీఎం సూచించారు. ఈ సమాచారం రాష్ట్రంలోని యువతకు సులభంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. యువత తమ వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోగానే, వారి నైపుణ్యాలకు తగిన రెజ్యూమే (Resume) ఆటోమేటిక్‌గా రూపొందేలా పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

    పెట్టుబడులు – ఉద్యోగావకాశాలు – నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకత

    రాష్ట్రంలో ఇప్పటికే 9.5 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు, తద్వారా 8.5 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అయితే, మారుతున్న కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువత కూడా తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. ఈ దిశగా సంబంధిత శాఖ యువతకు నాణ్యమైన శిక్షణను అందించాలని ఆదేశించారు.

    నైపుణ్యాభివృద్ధి శాఖ పాత్ర – ప్రపంచస్థాయి అవకాశాలపై దృష్టి

    రాష్ట్రంలోని యువతకు ప్రపంచ స్థాయిలో పోటీపడి, ఉత్తమ ఉద్యోగాలు సాధించేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత నైపుణ్యాభివృద్ధి శాఖదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్య, ఐటీ, నిర్మాణ రంగాలతో పాటు ఇతర కీలక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ యువత తమ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

    విదేశీ భాషా నైపుణ్యం – తప్పనిసరి

    ప్రపంచవ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే, కేవలం ఇంగ్లీష్ భాషా నైపుణ్యం మాత్రమే సరిపోదని, ఇతర ముఖ్యమైన విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు అనుగుణంగా, వివిధ దేశాల భాషలను బోధించడానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

    నారా లోకేష్ నివేదిక: నైపుణ్యాభివృద్ధిలో ప్రగతి

    ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం ఐదు క్లస్టర్లలో సమగ్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పాలిటెక్నిక్ మరియు ఐటీఐ విద్యార్థులకు ఆయా పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు లోకేష్ తెలిపారు.

    ఇప్పటివరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 1,164 ఉద్యోగమేళాలు నిర్వహించినట్లు, వీటి ద్వారా 61,991 మంది యువతీయువకులు ఉద్యోగాలు పొందినట్లు మంత్రి వివరించారు. అంతే కాకుండా, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారిలో 74,834 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

    ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ – భవిష్యత్ కార్యాచరణ

    రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్ ప్రణాళికలో భాగంగా, రాష్ట్రంలోని యువతకు సమగ్ర శిక్షణ అందించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఆరవ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పాఠ్యాంశాలలో భాగంగా చేయాలని సూచించారు. విద్యాసంస్థలతో పరిశ్రమలను అనుసంధానం చేసి, ఆచరణాత్మక నైపుణ్య శిక్షణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు.

    ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో కనీసం 1,500 మందికి ఉద్యోగాలు లభించేలా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్య సాధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • 10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    10వేల మందికి ఏఐ నైపుణ్య శిక్షణ: ఎన్విడియాతో ఒప్పందం

    AP Signs MoU with NVIDIA For AI: ఈ రోజు టెక్నాలజీ అంటే.. ముందుగా వినిపిస్తున్న పేరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో AI టెక్నాలజీ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. అలాంటి టెక్నాలజీని రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) కూడా ప్రవేశపెట్టాలని.. ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే ఏఐ యూనివర్సిటీకి ఎన్వీడియా కంపెనీ సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.

    రాష్ట్రంలో ఏఐ నైపుణ్యాభివృద్ధికి ఎన్విడియాతో కీలక ఒప్పందం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వడానికి, మరో 500 స్టార్టప్‌ల అభివృద్ధికి ఎన్వీడియా కంపెనీతో శుక్రవారం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖా మంత్రి ‘నారా లోకేష్’ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఎన్విడియా సహకారం – మంత్రి నారా లోకేష్ చొరవ

    రాష్ట్రంలోని సుమారు 10వేలమంది విద్యార్థులకు ఏఐలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు.. ఏఐ యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఎన్వీడియా తన సహకారం అందించనుంది. అక్టోబర్ 2024లో మంత్రి నారా లోకేష్ ముంబైలో ఎన్వీడియా సీఈఓ ‘జెన్సన్ హుయాంగ్’ను కలిశారు. ఆ సమయంలో ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీకి సహకారం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు హుయాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆ తరువాత ఇప్పటికే ఎన్వీడియా కంపెనీతో ఒప్పందం జరిగింది.

    ఏపీని ఏఐ రీసెర్చ్ హబ్‌గా మార్చే ప్రభుత్వ లక్ష్యం

    భారతదేశంలో ఏపీని ఏఐ రీసర్చ్ హబ్ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దిగ్గజ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐ మీద శిక్షణ ఇవ్వనున్నారు.

    ప్రభుత్వ మద్దతు మరియు వనరులు

    ఏఐ యూనివర్సిటీకి కావాల్సిన పరికరాలు (కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్స్ మరియు హార్డ్‌వేర్ సామర్త్యలు) ప్రభుత్వం అందిస్తుంది. అంతే కాకుండా.. ప్రభుత్వమే విద్యార్థులకు పరిశోధనావకాశాలను, ఉద్యోగావకాశాలను కల్పించనుంది.

    ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

    రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు:

    • మంత్రి నారా లోకేష్
    • ఎన్వీడియా సౌత్ ఇండియా ఎండీ దూపర్
    • గణేష్ మహబాల
    • ఉన్నత విద్యా కార్యదర్శి
    • ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తి

    ఏఐ టెక్నాలజీ: ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు భవిష్యత్ దిశ

    ఒక్క భారతదేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో దిగ్గజ కంపెనీలు సైతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఈ రోజు భారతదేశం ఏఐ టెక్నాలజీలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కారణంగానే.. పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ మరిన్ని రంగాలకు విస్తరిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

    వివిధ రంగాల్లో ఏఐ అనువర్తనాలు, ఉద్యోగాలపై ప్రభావం

    ఏఐ టెక్నాలజీ ఒక్క ఐటీ రంగంలో మాత్రమే కాకుండా.. ఎడ్యుకేషన్, మీడియా, టెలి కమ్యూనికేషన్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో కూడా విస్తరించి ఉంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని చాలామంది గతంలోనూ.. ఇప్పుడు కూడా భయపడుతున్నారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, ఏఐ టెక్నాలజీ పనిని వేగవంతం చేయడానికి పనికొస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఉద్యోగులు లేదా ఉద్యోగార్థులు మారుతున్న ప్రపంచంలో.. వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని నేర్చుకోవడం ఉత్తమం.