Tag: Volkswagen Golf GTI

  • ఫహద్ ఫాసిల్ కొత్త కారు ఇదే: ధర ఎంతంటే..

    ఫహద్ ఫాసిల్ కొత్త కారు ఇదే: ధర ఎంతంటే..

    Fahadh Faasil Volkswagen Golf GTI: భారతదేశంలో కార్ల ప్రియుల మనసు దోచుకున్న జర్మన్ కార్ల తయారీ సంస్థ ‘ఫోక్స్‌వ్యాగన్’ (Volkswagen) ఇటీవల తన ఐకానిక్ ‘గోల్ఫ్ జీటీఐ’ (Golf GTI) హాట్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. అయితే, ఈ కొత్త గోల్ఫ్ జీటీఐని కేవలం 150 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ అరుదైన కార్లలో ఒకదానిని ప్రముఖ మలయాళ నటుడు, ‘పుష్ప’ ఫేమ్ ‘ఫహద్ ఫాసిల్’ (Fahadh Faasil) సొంతం చేసుకున్నారు.

    ఫహద్ ఫాసిల్ గ్యారేజీలో కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ

    నటుడు ఫహద్ ఫాసిల్ తన సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారును కొనుగోలు చేసి, డెలివరీ తీసుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఫహద్ ఫాసిల్ గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ (Grenadilla Black Metallic) రంగులో ఉన్న స్టైలిష్ గోల్ఫ్ జీటీఐ పక్కన నిల్చొని ఉండటం చూడవచ్చు. ఈ కారు మూన్‌స్టోన్ గ్రే (Moonstone Grey), కింగ్స్ రెడ్ (Kings Red), మరియు ఓనిక్స్ వైట్ (Onyx White) వంటి ఆకర్షణీయమైన రంగులలో కూడా లభిస్తుంది.

    వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ: ధర మరియు స్పెసిఫికేషన్లు

    భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ ప్రారంభ ధర సుమారు రూ. 53 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ఒక పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ హాట్ హ్యాచ్‌బ్యాక్.

    ఇంజిన్ మరియు పర్ఫామెన్స్

    ఈ కారులో 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ల టర్బో-పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఈ శక్తివంతమైన ఇంజిన్ 265 హార్స్‌పవర్ శక్తిని మరియు 370 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయెల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ (DSG)తో జతచేయబడి ఉంటుంది, ఇది వేగవంతమైన మరియు సున్నితమైన గేర్ షిఫ్ట్‌లను అందిస్తుంది.

    టాప్ స్పీడ్

    ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ ఫ్రంట్ యాక్సిల్ డిఫరెన్షియల్ లాక్‌ను కలిగి ఉంది, ఇది మెరుగైన ట్రాక్షన్ మరియు కార్నరింగ్ పనితీరును అందించడానికి దోహదపడుతుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 267 కిలోమీటర్లు కావడం విశేషం. ఈ అద్భుతమైన పనితీరు కారణంగానే చాలా మంది కార్ల ఔత్సాహికులు దీనిని ఇష్టపడుతున్నారు.

    ఫహద్ ఫాసిల్ కార్ కలెక్షన్

    నటుడు ఫహద్ ఫాసిల్ ఒక గొప్ప వాహన ప్రేమికుడు. ఎప్పటికప్పుడు తనకు ఇష్టమైన మరియు అత్యాధునిక వాహనాలను తన గ్యారేజీలో చేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐతో పాటు, ఆయన వద్ద ఇప్పటికే అనేక ఇతర ఖరీదైన మరియు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో కొన్ని:

    • మినీ కంట్రీమ్యాన్ (Mini Countryman)
    • లంబోర్ఘిని ఉరుస్ (Lamborghini Urus)
    • పోర్షే 911 (Porsche 911 Carrera S)
    • ల్యాండ్ రోవర్ డిఫెండర్ (Land Rover Defender)

    ఫహద్ ఫాసిల్ గురించి..

    ఫహద్ ఫాసిల్ ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ముఖ్యంగా, అల్లు అర్జున్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు ‘పుష్ప: ది రైజ్’ మరియు ‘పుష్ప 2: ది రూల్’ సినిమాలలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో, “పార్టీ లేదా పుష్పా?” అంటూ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఫహద్ ఫాసిల్ ఒకరిగా నిలిచారు.

    అవార్డులు మరియు పారితోషికం

    ఫహద్ ఫాసిల్ పూర్తి పేరు ”అబ్దుల్ హమీద్ మొహమ్మద్ ఫహద్ ఫాసిల్”. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు, విజయవంతమైన చిత్ర నిర్మాత కూడా. తన నటనా ప్రతిభకు గాను ఫహద్ ఫాసిల్ ఇప్పటికే ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మరియు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను (సౌత్) గెలుచుకున్నారు. సమాచారం ప్రకారం, ఈయన ఒక్కో సినిమాకు సుమారు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే, ‘పుష్ప 2’ సినిమాకు ఏకంగా రూ. 8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు ఇదే: ధర మరియు పూర్తి వివరాలు ఇవే..

    ఫోక్స్‌వ్యాగన్ కొత్త కారు ఇదే: ధర మరియు పూర్తి వివరాలు ఇవే..

    Volkswagen Golf GTI India Launch: చెప్పినట్లుగానే ఫోక్స్‌వ్యాగన్.. తన ‘గోల్ఫ్ జీటీఐ’ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఫోక్స్‌వ్యాగన్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    ధర మరియు బుకింగ్స్

    కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు ధర రూ. 53 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశంలోకి వస్తుంది, ఈ కారణంగానే దీని ధర అధికంగా ఉంటుంది.

    దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారు.. ప్రారంభంలో 150 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే ఈ కారును కేవలం 150 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అర్హులు. దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు మరో 100 యూనిట్లను విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

    ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ డిజైన్

    లేటెస్ట్ డిజైన్ కలిగిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్‌ను పొందుతుంది. దీని ముఖ్యమైన ఎక్స్‌టీరియర్ ఫీచర్లు:

    • ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్
    • సన్నని డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్స్)
    • స్పోర్టీ డిజైన్ బంపర్
    • ఎక్స్-షేప్ ఎల్ఈడీ ఫాగ్ లైట్
    • గ్రిల్ మీద జీటీఐ బ్యాడ్జ్
    • ఫ్రంట్ డోర్స్ మరియు టెయిల్‌గేట్‌పై జీటీఐ బ్యాడ్జ్
    • 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్
    • రెడ్ బ్రేక్ కాలిపర్స్
    • ఎల్ఈడీ టెయిల్ లైట్స్
    • రూఫ్ స్పాయిలర్
    • రెండు ఎగ్జాస్ట్ టిప్స్

    ప్రీమియం ఇంటీరియర్ మరియు ఫీచర్లు

    ఇంటీరియర్ విషయానికి వస్తే, ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ లోపల ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి:

    • హెడ్‌రెస్ట్‌పై రెడ్ కలర్ జీటీఐ స్టిచ్చింగ్ కలిగిన స్పోర్ట్స్ సీట్లు (మధ్యలో సిగ్నేచర్ టార్టన్ ఇన్సర్ట్‌లతో)
    • లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్
    • 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    • 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
    • సన్‌రూఫ్
    • వైర్‌లెస్ ఛార్జర్
    • త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్
    • ప్యాడిల్ షిఫ్టర్లు
    • 30 కలర్ యాంబియంట్ లైటింగ్
    • హీటెడ్ ఫ్రంట్ సీట్లు

    కలర్ అషన్స్ & సేఫ్టీ ఫీచర్స్

    కొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లలో లభిస్తుంది:

    కలర్ ఆప్షన్స్:

    • గ్రెనడిల్లా బ్లాక్
    • కింగ్స్ రెడ్
    • మూన్‌స్టోన్ గ్రే
    • ఓరిక్స్ వైట్

    భద్రత విషయంలో కూడా ఈ కారు అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది:

    సేఫ్టీ ఫీచర్స్:

    • ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు
    • రియర్ వ్యూ కెమెరా
    • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (TPMS)
    • ఐసోఫిక్స్ యాంకర్లు
    • ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్
    • లేన్ చేంజ్ అసిస్ట్
    • రియర్ ట్రాఫిక్ అలర్ట్
    • లెవెల్ 2 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)

    ఇంజిన్ మరియు పనితీరు

    ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గది ఇంజిన్. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 265 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ (DSG) ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.

  • లాంచ్ కానేలేదు.. అప్పుడే బుకింగ్స్ క్లోజ్: ఈ కారుకు బలే డిమాండ్!

    లాంచ్ కానేలేదు.. అప్పుడే బుకింగ్స్ క్లోజ్: ఈ కారుకు బలే డిమాండ్!

    Volkswagen Golf GTI: భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. దేశీయ విఫణిలో సరికొత్త కారు గోల్ఫ్ జీటీఐ (Golf GTI) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా అంతకంటే ముందు కంపెనీ అధికారికంగా బుకింగ్స్ స్వీకరించడం (మే 5) ప్రారంభించింది. అయితే బుకింగ్స్ ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే.. ఇక బుకింగ్స్ తీసికోవడం లేదని, బుకింగ్స్ క్లోజ్ చేసినట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది.

    ఇండియాలో బుకింగ్స్ జోరు, వేగంగా ముగింపు!

    ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ భారతదేశానికి జీటీఐ బ్యాడ్జ్‌ను తీసుకుని రావడం ఇది రెండోసారి. మొదటిసారి 2016లో పోలో జీటీఐ పేరుతో.. లాంచ్ చేసింది. ఇప్పుడు గోల్ఫ్ జీటీఐ పేరుతో తీసుకురావడానికి రెడీ అయిపోయింది. అయితే కంపెనీ దీనిని సీబీయూ (CBU – Completely Built Unit) మార్గం ద్వారా దిగుమతి చేసుకోనుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

    బుకింగ్స్ నిలిపివేయడానికి కారణం ఏంటి?

    కంపెనీ తన గోల్ఫ్ జీటీఐ యొక్క బుకింగ్స్ నిలిపివేయడానికి ప్రధాన కారణం.. ఈ కారును భారతదేశానికి పరిమిత సంఖ్యలో కేటాయించడమే అని తెలుస్తోంది. అంటే ఈ కారును కొంతమంది మాత్రమే కొనుగోలు చేయగలరన్నమాట. మొదట్లో ఈ కారును ఇండియన్ మార్కెట్ కోసం 250 యూనిట్లను కేటాయించిన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా.. ఆ తరువాత 150 యూనిట్లకు మాత్రమే సరిపెట్టింది. ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేయనున్న గ్లోఫ్ జీటీఐ కారును 150 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

    జీటీఐ చరిత్ర మరియు ప్రత్యేకతలు

    ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేయనున్న సరికొత్త గోల్ఫ్ జీటీఐ ఆధునిక హంగులతో మార్కెట్లో అడుగుపెట్టనుంది. నిజానికి ఇది గోల్ఫ్ నేమ్ ప్లేట్ కలిగిం ఎనిమిదవ తరం అని తెలుస్తోంది. గోల్ఫ్ పేరు 1974లో ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ జార్జెట్టో గియుగియారో రోపొందించిన మొదటి హ్యాచ్‌బ్యాక్‌తో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 1976లో మొదటి తరం జీటీఐ వచ్చింది. ఆ తరువాత కాలంలో దీని వారసత్వంగా అనేక మోడల్స్ వచ్చాయి.

    ఇంజిన్ మరియు పనితీరు

    సరికొత్త ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ 2.0 లీటర్ టీఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 265 Bhp పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్‌బాక్స్ (DSG) కలిగి ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా పొందుతుంది. ఇది గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి 5.9 సెకన్ల సమయం పడుతుందని సమాచారం.

    ఆధునిక ఫీచర్లు మరియు భద్రత

    ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ అనేక ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 30 కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూప్ వంటి వాటితో పాటు.. ఏడు ఎయిర్‌బ్యాగులు మరియు ఏడీఏఎస్ (ADAS – Advanced Driver Assistance Systems) ఫంక్షన్స్ మొదలైనవి ఉన్నాయి. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నాము.