బంపరాఫర్.. కొత్త కారు కొనుగోలుపై రూ.2 లక్షల డిస్కౌంట్: పూర్తి వివరాలు చూడండి

Tata Motors 2024 September Discounts On Electric Cars in India: పాఠకులకు ముందుగా వినాయక చవితి శుభాకంక్షలు. భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ తరుణంలో చాలామంది కొత్త వాహనాలు కొనడానికి ముందడుగు వేస్తారు. అలంటి వాటికి టాటా మోటార్స్ (Tata Motors) గుడ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందించడం కూడా మొదలు పెట్టేసింది. ఇక్కడ ఈ కథనంలో టాటా మోటార్స్ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనే వివరాలు చూసేద్దాం.. రండి.

టాటా మోటార్స్ ఈ నెలలో (సెప్టెంబర్ 2024) టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ కొనుగోలుపైన మాత్రమే డిస్కౌంట్స్ అందించడం స్టార్ట్ చేసింది. ఈ డిస్కౌంట్స్ 2023 మోడల్‌లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ నెల 30 లోపల కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి.

నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)

2024 సెప్టెంబర్ నెలలో టాటా నెక్సాన్ ఈవీ కొనుగోలు చేసేవారు గరిష్టంగా రూ. 2.03 లక్షల డిస్కౌంట్ లేదా ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్స్ అనేవి ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా 2023 నెక్సాన్ ఈవీలకు కొనుగోలు చేసేవారు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందుతారు.

భారతదేశంలో నెక్సాన్ ఈవీ ధరలు రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.49 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారు 30 కిలోవాట్ మరియు 40.5 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. ఇవి రెండూ వరుసగా 275 కిమీ మరియు 390 కిమీ రేంజ్ అందిస్తాయి. దేశీయ విఫణిలో ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ400 మరియు రాబోయే ఎంజీ విండ్సర్ అనే కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)

ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ యొక్క 2023 టియాగో ఈవీ కొనుగోలుపై కస్టమర్ రూ. 65000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే టియాగో ఈవీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. డిస్కౌంట్స్ లేదా తగ్గింపులు మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటాయి.

టాటా టియాగో ఈవీ ధరలు ఇండియాలో రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.89 లక్షల మధ్య ఉన్నాయి. ఇది నెక్సాన్ ఈవీ మాదిరిగానే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. ఒకటి 24 కిలోవాట్బ్ బ్యాటరీ. ఇది 275 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక రెండో బ్యాటరీ 19.2 కిలోవాట్ యూనిట్. ఇది ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 221 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

పంచ్ ఈవీ (Tata Punch EV)

టాటా మోటార్స్ యొక్క అత్యంత సురక్షితమైన కారు మరియు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన ఉత్తమ మోడల్ ‘పంచ్ ఈవీ’ ఈవీ కొనుగోలుపైన కూడా కంపెనీ రూ. 30000 వరకు తగ్గింపులు అందిస్తుంది. ఈ డిస్కౌంట్ మీరు ఎంచుకునే వేరియంట్ను బట్టి ఉంటుంది. ఈ తగ్గింపులు 2023 మోడల్ కొనుగోలుపైన మాత్రమే లభిస్తాయి.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి అమమకాలు పొందుతున్న టాటా పంచ్.. ప్రస్తుతం పెట్రోల్, CNG మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. పంచ్ ఈవీ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులో 35 కిలోవాట్ బ్యాటరీ 365 కిమీ రేంజ్ మరియు 25 కిలోవాట్ బ్యాటరీ 265 కిమీ రేంజ్ అందిస్తాయని ధృవీకరించబడింది.

Don’t Miss: డీకే శివకుమార్ కాలేజ్ డేస్ బైక్ ఇదే!.. ఓ లుక్కేసుకోండి

Note: భారతదేశంలో టాటా మోటార్స్ అందిస్తున్న ఈ డిస్కౌంట్స్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తగ్గింపులు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డిస్కౌంట్స్ లభిస్తాయి. కాబట్టి ఈ నెలలో టాటా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే సమీపంలోని కంపెనీ యొక్క అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.