కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం – ఈ కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్

Tata Motors Discounts: 2023 సంవత్సరాంతంలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎంపిక చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్ల మీద మంచి బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ కథనంలో ఆ డిస్కౌంట్స్ వివరాలు వివరంగా తెలుసుకుందాం.

టాటా మోటార్స్ అందిస్తున్న ఆఫర్స్ ఈ నెలలో టాటా టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ మోడల్స్ కొనుగోలు మీద మాత్రమే లభిస్తాయి. ఈ ఆఫర్స్ కేవలం ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే డిసెంబర్ 31 లోపల ఈ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేవారు ఈ ఆఫర్ పొందవచ్చు.

టిగోర్ ఈవీ (Tata Tigor EV)

టాటా మోటార్స్ యొక్క అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు ‘టిగోర్ ఈవీ’ కొనుగోలు మీద రూ. 1.10 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. అంటే కొనుగోలుదారులు ఈ కారుని ఈ నెలలో కొనుగోలు చేస్తే రూ. 1.10 లక్షల తగ్గింపు పొందవచ్చు. టిగోర్ ఈవీ అన్ని వేరియంట్ల మీద రూ. 50000 వరకు ఎక్స్చేంజ్ బోనస్‌, రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక కార్పొరేట్ ప్రయోజనాల కింద్ రూ. 10000 తగ్గింపుని పొందవచ్చు.

దేశీయ మార్కెట్లో టాటా టిగోర్ ఈవీ ధరలు ప్రస్తుతం రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య ఉన్నాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారులో 26 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఇందులోని పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ 75 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)

టియాగో ఈవీ కొనుగోలుపైనా టాటా మోటార్స్ రూ. 77,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. టియాగో ఈవీ యొక్క ఏమికా చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 15000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. అయితే ఈ కారు కొనుగోలుపైనా ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ అనేది లభించదు. కానీ కస్టమర్లు దీనిపైన రూ. 55,000 వరకు గ్రీన్ బోనస్‌ పొందవచ్చు. అంతే కాకుండా రూ. 7000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లు లభిస్తాయి.

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా టియాగో ఈవీ ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 12.04 లక్షల మధ్య ఉన్నాయి. మీడియం రేంజ్ మరియు లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో ఉండే టియాగో ఈవీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

టాటా టియాగో మీడియం రేంజ్ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 250 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ 61 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్ ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 315 కిమీ పరిధిని అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 74 హార్స్ పవర్ మరియు 114 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Don’t Miss: కేవలం 660 మందికి మాత్రమే ఈ Audi కారు.. ఎందుకంటే?

కంపెనీ అందించే ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలుదారుడు దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.