31.2 C
Hyderabad
Saturday, March 22, 2025

టాటా నెక్సాన్ ఇప్పుడు సన్‌రూఫ్‌తో.. దీని రేటెంతో తెలుసా?

Tata Nexon Available With Panoramic Sunroof: టాటా మోటార్స్ భారతదేశంలో నెక్సాన్ లాంచ్ చేసినప్పటి నుంచి గొప్ప అమ్మకాలను పొందుతూనే ఉంది. ఇప్పటికే ఈ కారు డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉంది. ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ నెక్సాన్ కారులో పనోరమిక్ సన్‌రూఫ్ లేకపోవడం వాహన ప్రియులను కొంత నిరాశకు గురి చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు ఎట్టకేలకు ఆ ఫీచర్ కూడా అందుబాటుకి తీసుకువచ్చేసింది.

నెక్సాన్ ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ పొందటం అనేది గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఈ ఫీచర్స్ అన్ని విభాగాల్లోని నెక్సాన్ కార్లలో అందుబాటులో ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన నెక్సాన్ ధరలు 1రూ. 3.60 లక్షల నుంచి రూ. 15.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్ కలిగిన నెక్సాన్ సీఎన్‌జీ ధరలు రూ. 12.80 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్య ఉన్నాయి. ధరల పరంగా సాధారణ నెక్సాన్ కంటే రూ. 1.3 లక్షలు ఎక్కువని తెలుస్తోంది.

టాటా నెక్సాన్ సీఎన్‌జీ అనేది దేశీయ మార్కెట్లో నెల రోజుల క్రితమే లాంచ్ అయింది. అయితే ఈ మోడల్ యొక్క టాప్ స్పెక్ వేరియంట్ మాత్రమే పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కలిగిన ఏకైన టాటా సీఎన్‌జీ కారు నెక్సాన్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కోసం ఎదురు చూసేవారు నిశ్చింతగా నెక్సాన్ కొనుగోలు చేయవచ్చు.

నెక్సాన్ సేల్స్

2017 లాంచ్ అయినప్పటి నుంచి నెక్సాన్ గొప్ప అమ్మకాలను పొందుతూనే ఉంది. ఇప్పటికే మార్కెట్లో 7 లక్షల కంటే ఎక్కువ నెక్సాన్ ఫ్యూయల్ కార్లు అమ్ముడైనట్లు సమాచారం. నెక్సాన్ ఈవీ మోడల్ 50వేల యూనిట్ల అమ్మకాలను పొందినట్లు తెలుస్తోంది. ఇక సీఎన్‌జీ అమ్మకాలు కూడా ఆశాజనకంగా ఉంటాయని తెలుస్తోంది.

నెక్సాన్ యొక్క అన్ని కార్లు చూడటానికి ఒకేలా అనిపించినప్పటికీ.. మోడల్‌ను బట్టి ఫీచర్స్ మారుతూ ఉంటాయి. ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకంగా ఛార్జింగ్ పోర్ట్ పొందుతుంది. నెక్సాన్ ఈవీ ఒక సింగిల్ ఛార్జీతో 312 కిమీ నుంచి 453 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ ఎక్కువ ఇవ్వడమే కాకుండా.. అత్యాధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్న కారణంగా ఎక్కువమంది ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ అమ్మకాల్లో అగ్రగామిగా ఉంది.

ఎక్కువమంది సన్‌రూఫ్ ఫీచర్ ఇష్టపడటానికి కారణం

దశాబ్దాల క్రితం భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఏ కారులోనూ సన్‌రూఫ్ ఫీచర్ ఉండేదే కాదు. ఆ తరువాత కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు దాదాపు ప్రతి కారులోనూ సన్‌రూఫ్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనికి ప్రధాన కారణం.. కార్ల కొనుగోలుదారులు అందరూ కూడా సన్‌రూఫ్ ఉండే కార్లను మాత్రమే కొనుగోలు చేయడానికి సిద్దపడుతున్నారు.

సన్‌రూఫ్ ఫీచర్ అనేది కారు లోపలికి గాలి, వెలుతురు వచ్చేలా చేస్తాయి. దీని ద్వారా కారు లోపల ఉన్నవారు బయటి ఉన్న వాటిని కూడా చూడవచ్చు. లోపలి నుంచే పర్యావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ కారణంగానే చాలామంది సన్‌రూఫ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా నెక్సాన్ కూడా సన్‌రూఫ్ ఫీచర్ అందించడం మొదలుపెట్టింది.

Don’t Miss: మోదీ కల గురించి చెప్పిన నితిన్ గడ్కరీ: దేశం ఎదగాలంటే.. మరో పదేళ్లలో..

సాధారణ కార్లకంటే కూడా సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్ల ధరలు కొంత ఎక్కువగానే ఉంటాయి. ధర కొంత ఎక్కువైనా.. సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లనే ప్రజలు కూడా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు కూడా ఈ సన్‌రూఫ్ ఫీచర్ అందిస్తున్నాయి. ఇకపై భవిష్యత్తులో దాదాపు అన్ని కార్లు కూడా సన్‌రూఫ్ ఫీచర్ కలిగి ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు దాదాపు అన్ని కార్లూ కూడా తప్పకుండా సన్‌రూఫ్ ఫీచర్ పొందుతాయని భావిస్తున్నాము.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు