Tata Nexon Red Dark Edition Launched: అమ్మకాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ యొక్క నెక్సాన్ సిఎన్‌జీ (Nexon CNG).. ఎట్టకేలకు రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వేరియంట్స్ & ధర
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ‘టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్’ (Tata Nexon CNG Red Dark Edition) మూడు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి క్రియేటివ్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ప్లస్ పీఎస్ మరియు ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్. వీటి ధరలు వరుసగా రూ. 12.7 లక్షలు, రూ. 13.7 లక్షలు మరియు రూ. 14.5 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ కారు ధర సాధారణ సిఎన్‌జీ కారు కంటే రూ. 20,000 ఎక్కువ.
డిజైన్
పేరుకు తగ్గట్టుగానే నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్.. రెడ్ అండ్ డార్క్ కలర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి కారులో అక్కడక్కడా.. రెడ్ కలర్ యాక్సెంట్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఎక్స్‌టీరియర్ మొత్తం కార్బన్ బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. రెడ్ లెథెరెట్ అపోల్స్ట్రే, రెడ్ స్టిచ్చింగ్ మరియు పియానో బ్లాక్ ఇంటీరియర్ వంటివి ఈ కారులో చూడవచ్చు.
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్
కొత్త టాటా నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ పొందుతుంది. కాబట్టి ఇచ్చి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 10.20 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్స్, రియర్ ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎల్ఈడీ లైట్స్ మరియు వివిధ భాషలకు సపోర్ట్ చేసే పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ డీటెయిల్స్
నెక్సాన్ సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఇంజిన్ మరియు పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ కారులో 1అదే .2 లీటర్ త్రీ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సిఎన్‌జీతో నడుస్తున్నప్పుడు.. 100 హార్స్ పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న టాటా నెక్సాన్ 2017లో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి అనేక అప్డేట్స్ పొందుతూ.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జీ రూపాల్లో అందుబాటులో ఉంది. కాగా ఇప్పుడు ఆధునిక హంగులతో సిఎన్‌జీ రెడ్ డార్క్ ఎడిషన్ రూపంలో మార్కెట్లో అడుగు పెట్టింది. ఇది కూడా తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుంది భావిస్తున్నాము.
ఇండియాలో నెక్సాన్ సేల్స్
భారతదేశంలో టాటా నెక్సాన్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 లక్షల కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది, కాబట్టి మరిన్ని అమ్మకాలు నెక్సాన్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. అంతే కాకుండా ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో నెక్సాన్ ఈవీ అమ్మకాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.
Also Read: ఐదు లక్షల మంది కొన్న ఏకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
నిజానికి కొంతమంది ఉన్న వాహనాలనే కొంత భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా అప్పుడప్పుడు సరికొత్త ఎడిషన్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు టాటా మోటార్స్ లాంచ్ చేసిన కొత్త రెడ్ డార్క్ ఎడిషన్ కూడా స్టాండర్డ్ సిఎన్‌జీ కారుకు కొంత భిన్నంగా కనిపిస్తుంది.