2023లో ఇవే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు (Electric Cars) – ఎందుకంటే?

Top 5 Best Electric Cars in India 2023: భారతీయ మార్కెట్లో ఈ ఏడాది (2023) లెక్కకు మించిన కార్లు లాంచ్ అయ్యాయి. అందులో పెట్రోల్, డీజిల్, CNG కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఈ సంవత్సరం దేశీయ విఫణిలో అడుగుపెట్టిన టాప్ 5 పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎంజి కామెట్ ఈవీ (MG Comet EV)

దేశీయ మార్కెట్లో 2023లో లాంచ్ అయిన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లలో ‘ఎంజి మోటార్స్’ (MG Motors) కంపెనీకి కామెట్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. రూ. 7.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో ఏకంగా 230 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను సాధించి టాటా టియాగో ఈవీకి ప్రత్యర్థిగా నిలిచింది.

10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో వన్ టచ్ తాంబూలం అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Nexon EV Facelift)

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ యొక్క ‘నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్’ చెప్పుకోదగ్గ మోడల్. రూ. 14.74 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఒక సింగిల్ ఛార్జి మీద 465 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు ప్రారంభం నుంచి కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొంది, మంచి అమ్మకాలు పొందుతూ సాగుతోంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందిన ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా కంపెనీకి చెందిన నెక్సాన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్.

సిట్రోయెన్ ఈసీ3 (Citroen eC3)

ఇండియన్ మార్కెట్లో ఈ ఏడాది విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ యొక్క ‘ఈసీ3’ కూడా చెప్పుకోదగ్గ మోడల్. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ కారు ఒక సింగిల్ చార్జితో 320 కిమీ రేంజ్ అందిస్తుంది.

సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 29.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 107 కిమీ వరకు ఉంటుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5)

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల జాబితాలో ఒకటైన హ్యుందాయ్ కంపెనీకి చెందిన ‘ఐయోనిక్ 5’ ఎలక్ట్రిక్ కారు కూడా ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన పాపులర్ మోడల్. రూ.44.95 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ కారు కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారుని ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6 కిలోవాట్ బ్యాటరీ కలిగి 214 Bhp పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 631 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

Don’t Miss: Mahindra కార్లపై భారీ డిస్కౌంట్స్ – ఏకంగా రూ.1.25 లక్షల వరకు..

మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400)

ఎక్స్‌యూవీ400 కూడా ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు. మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు సింగిల్ చార్జితో ఏకంగా 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.