Ultraviolette F77 Mach 2 Launched in India: బెంగళూరుకు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ కంపెనీ బైకులు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఈ తరుణంలో కంపెనీ ఎట్టకేలకు మరో కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర ఎంత, వివరాలు, రేంజ్ వంటి వైవరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు ‘ ఎఫ్77 మాక్ 2’ ( F77 Mach 2). ఈ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ కాస్మొటిక్ అప్డేట్స్ మరియు మెరుగైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు దాని ఎఫ్77 (F77) కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఈ బైక్ కూడా ఎఫ్77 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించబడింది.
ధర & బుకింగ్స్ (Price & Bookings)
అల్ట్రావయొలెట్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎఫ్77 మాక్ 2 బైక్ ప్రారంభ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ బైక్ కోసం కష్టమరలు రూ. 5000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు వచ్చే నెల ప్రారంభంలో ప్రారంభమవుతాయి.
వేరియంట్స్ & కలర్ ఆప్షన్స్ (Variants & Colour Options)
కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 బైక్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ మరియు రీకాన్. వీటి ధరలు వరుసగా రూ. 2.99 లక్షలు మరియు రూ. 3.99 లక్షలు. ఈ ధరలు కేవలం మొదటి 1000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తరువాత ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంటుంది.
అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి లైటింగ్ బ్లూ, ఆస్టరాయిడ్ గ్రే, టర్బో రెడ్, ఆఫ్టర్‌బర్నర్ ఎల్లో, స్టెల్త్ గ్రే, కాస్మిక్ బ్లాక్, ప్లాస్మా రెడ్, సూపర్‌సోనిక్ సిల్వర్ మరియు స్టెల్లార్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇందులో కస్టమర్ తనకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
డిజైన్ (Design)
కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 బైక్.. డిజైన్ పరంగా దాదాపు దాని పాత్ వెర్షన్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే దీని ఛార్జింగ్ పోర్ట్ ప్లాటిక్ మాదిరిగా కాకుండా.. అల్యూమినియం ప్లాప్ పొందుతుంది. కాబట్టి ఇది మరింత దృఢంగా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ చూడగానే చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.
ఫీచర్స్ (Features)
అల్ట్రావయొలెట్ ఎఫ్77 మాక్ 2 బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 5 ఇంచెస్ TFT డిజిటల్ క్లస్టర్, ఆటో డిమ్మింగ్ లైట్స్, హిల్ హోల్డ్, ఏబీఎస్ మరియు డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉంటాయి. టాప్ వేరియంట్ రీకాన్ ఫోర్ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది.
మాక్ 2 బైక్ 41 మిమీ USD ఫ్రంట్ పోర్క్, వెనుకవైపు ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోశాక్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 110/70, వెనుక భాగంలో 160/60 టైర్లను కలిగి ఉన్న 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 320 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక భాగంలో 230 మిమీ రియర్ డిస్క్ బ్రేకులు ఇందులో ఉంటాయి. ఇవన్నీ మంచి పనితీరును అందిస్తాయి.
బ్యాటరీ అండ్ రేంజ్ (Battery and Range)
మాక్ 2 ఎలక్ట్రిక్ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీతో 27 kW మోటరుతో వస్తుంది. అయితే రీకాన్ మోడల్ 30 kW మోటరుతో 10.3 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ ఒక సింగిల్ చార్జితో 211 కిమీ రేంజ్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 323 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. రీకాన్ టెన్ లెవెల్ స్విచబుల్ రీజెనరేటివ్ బ్రేకింగ్ లెవెల్స్ పొందుతుంది. స్టాండర్డ్ వేరియంట్ కేవలం త్రీ లెవెల్ మాత్రమే పొందుతుంది.
Don’t Miss: ఆస్టన్ మార్టిన్ కొత్త కారు వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎఫ్77 మాక్ 2ని మునుపటి కంటే సురక్షితంగా చేయడానికి సంస్థ ‘పర్ఫామెన్స్ ప్యాక్’ అందిస్తుంది. ఇందులో ఆప్టిమైజ్ చేసిన ఏబీఎస్ సిస్టం ఉంటుంది. ఇది ముందు మాత్రమే ఏబీఎస్ మోడ్‌ను కలిగి ఉంటుంది. వెనుక ఏబీఎస్‌ను ఆఫ్ చేసి.. ముందువైపు ఏబీఎస్‌ను పనిచేసేలా చేస్తుంది. కంపెనీ ఈ బైకులో రైన్, సిటీ మరియు ట్రాక్ అనే మరో మూడు అదనపు ట్రాక్షన్ కంట్రోల్స్ ప్రవేశపెట్టింది. ‘ఫైండ్ మై ఎఫ్77’ అనే ఫీచర్ కూడా ఇందులో లభిస్తుంది.