Ultraviolette New Two Wheelers Launched in India: ఇప్పటికే అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ చేసిన బెంగళూరుకు చెందిన వాహన తయారీ సంస్థ ‘అల్ట్రావయొలెట్’ (Ultraviolette) కంపెనీ.. ఎట్టకేలకు ఇప్పుడు మరో రెండు టూ వీలర్స్ లాంచ్ చేసింది. ఇందులో ఒకటి ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా.. మరొకటి డర్ట్ బైక్ మాదిరిగా ఉండే బైక్. ఈ రెండు బైకుల గురించి మరింత సమాచారం వివరంగా తెలుసుకుందాం.
అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Ultraviolette Tesseract Electric Scooter)
ఇది కంపెనీ లాంచ్ చేసిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటి వరకు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయలేదు. తాజాగా టెస్సెరాక్ట్ పేరుతో ఓ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). అయితే మొదటి 10000 స్కూటర్లను రూ. 1.20 లక్షలకే అందించనున్నట్లు సమాచారం. ఆ తరువాత యధావిధిగా ధర ఉంటుంది. కాబట్టి ముందుగా కొనుగోలు చేసినవారికి రూ. 25000 తగ్గింపు లభిస్తుంది. అయితే డెలివరీలు మాత్రం 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.
చూడటానికి కొత్తగా ఉన్న అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, ఇంటిగ్రేటెడ్ డాష్‌క్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 14 ఇంచెస్ వీల్స్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటితో పాటు 34 లీటర్ల కెపాసిటీ కలిగిన అండర్ సీట్ కెపాసిటీ కలిగిన బూట్ ఉంటుంది. ఇది డెసర్ట్ సాండ్, స్టీల్త్ బ్లాక్ మరియు సోనిక్ పింక్ అనే మూడు రంగులలో లభిస్తుంది.
కంపెనీ.. తన కొత్త టెస్సెరాక్ట్ బ్యాటరీ కెపాసిటీని వెల్లడించనప్పటికీ, ఇది ఒక సింగిల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 125 కిమీ/గం అని తెలుస్తోంది. 100 రూపాయల ఛార్జితో.. ఈ స్కూటర్ 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.
అల్ట్రావయొలెట్ షాక్‌వేవ్ ఎలక్ట్రిక్ బైక్ (Ultraviolette Shockwave Electric Bike)
కంపెనీ లాంచ్ చేసిన మరో టూ వీలర్ పేరు ‘షాక్‌వేవ్’. చూడటానికి చాలా సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్. ఇండియా). అయితే మొదటి 1,000 మంది కస్టమర్లు రూ. 1.50 లక్షలకే ఈ బైక్ కొనుగోలు చేయవచ్చు. సంస్థ ఈ బైక్ డెలివరీలను కూడా 2026 మొదటి త్రైమాసికంలోనే డెలివరీ చేయనున్నట్లు సమాచారం.
Also Read: పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?
ఈ బైక్ ఎల్లో/బ్లాక్, వైట్/రెడ్ అనే రెండు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కేవలం 120 కేజీల బరువున్న ఈ బైక్ 14.7 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది గంటకు 0 నుంచి 120 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క బ్యాటరీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ ఇది ఒక పుల్ ఛార్జితో 165 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది ఇప్పటి మార్కెట్లో ఉన్న ఇతర అన్ని బైకుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.