అనంత్, రాధిక పెళ్లి: మనుషులే కాదు.. కార్లు కూడా అందంగా తయారయ్యాయ్!

Rolls Royce Decorated with Flowers for Anant Radhika Wedding: ప్రపంచ ధనవంతులలో ఒకరు.. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి.. భూలోకమంత పీట, ఎంతరో వ్యాపారవేత్తలు, సినీతారలు, ఇతర దేశాధినేతల సమక్షంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం నిన్న (జులై 12) ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అనంత్, రాధికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పెళ్లి అంటే మనుషులు ప్రత్యేకంగా కనిపించడం అందరికి తెలిసిన విషయమే.. అయితే అంబానీ ఇంట జరిగిన పెళ్ళిలో కార్లు కూడా ప్రత్యేకంగా కనిపించాయి. ఇంటి నుంచి పెళ్లి జరిగే ప్రదేశానికి వెళ్ళడానికి రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ మొదలైన కార్లు పువ్వులతో బాగా డెకరేట్ చేయబడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కమనిస్తే.. ‘రోల్స్ రాయిస్ కలినన్’ (Rolls Royce Cullinan) బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ పువ్వులతో చాలా అందంగా అలంకరించబడి ఉంది. నిజానికి పెళ్లి వంటి ప్రత్యేక సందర్భాల్లో వాహనాలను అలంకరించడం భారతదేశంలో సర్వ సాధారణం. కాబట్టి అంబానీ ఫ్యామిలీ కూడా తమ కార్లను పూలతో డెకరేట్ చేయించారు. కారుకు ముందు భాగంలో, పైన మొత్తం ఓ తెర మాదిరిగా పువ్వులు అమర్చారు.

పువ్వులతో అలంకరించబడిన కార్లు

రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును ముకేశ్ అంబానీ, గత దీపావళి సందర్భంగా తన భార్య నీతా అంబానీ కోసం కొనుగోలు చేశారు. ఇది ఇతర రోల్స్ రాయిస్ కార్ల మాదిరిగా కాకూండా నారింజ రంగులో ఉండటం గమనించవచ్చు. గతంలో కూడా ఈ కారులో అంబానీ ఫ్యామిలీ పలుమార్లు కనిపించింది. ఇప్పుడు అదే కారును పువ్వులతో అలంకరించి సిద్ధం చేసుకున్నారు.

వీడియోలో రోల్స్ రాయిస్ కారు మాత్రమే కాకూండా మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680, మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్ మరియు రేంజ్ రోవర్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అంబానీ నివాసం నుంచి బయటకు రావడం చూడవచ్చు. ఈ కార్లను అందంగా పువ్వులతో అలంకరించడానికి కూడా అంబానీ భారీగా డబ్బు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది. పువ్వులతో అలంకరించబడిన తరువాత రోల్స్ రాయిస్ కాస్త.. ఓ పుష్పక విమానాన్ని తలపిస్తోంది.

రోల్స్ రాయిస్ కారు ధర

పువ్వులతో అలంకరించబడిన రోల్స్ రాయిస్ కారు ధర రూ. 10 కోట్లు కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది ఒక్క చూపుతోనే ఆకర్శించబడే డిజైన్, ఫ్రీమియం ఫీచర్స్, బ్లాక్ అవుట్ గ్రిల్ మొదలైనవి పొందుతుంది. ఇప్పటికే అంబానీ గ్యారేజిలో ఉన్న రోల్స్ రాయిస్ కార్లలో ఇది చాలా ప్రత్యేకమైన కారు అనే చెప్పాలి. ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పెళ్లి ఖర్చు

ముకేశ్ అంబానీ తన కొడుకు పెళ్లి కోసం ఏకంగా ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన కొడుకు కోసం రెండు సార్లు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసిన ముకేశ్ అంబానీ ఇప్పుడు దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిన్న మూడుముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంట చిన్న నాటి స్నేహితులు కూడా. వీరికి గతేడాదే నిశ్చితార్థం జరిగింది.

ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం కారణంగా భారీ భద్రత ఏర్పటు చేశారు. ప్రముఖుల తాకిడి ఎక్కువ కావడంతో పొలిసు బలగాలు ముంబైలో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నాయి. ఇదే తరుణంలో హోటల్స్ ధరలు ఆకాశాన్నంటాయి. కొన్ని కంపెనీలో తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ అవకాశం కల్పించి జులై 14 వరకు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాయి.

Don’t Miss: అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ ఖరీదైన కార్లు ఇవే!.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఇక రోల్స్ రాయిస్ కార్ల విషయానికి వస్తే.. ఎక్కువమంది ధనవంతులు ఇష్టపడే బ్రాండ్ ఈ రోల్స్ రాయిస్. ఎవరైనా జీవితంలో ఒక్కటైనా రోల్స్ రాయిస్ కొనాలనుకుంటారు. కానీ అంబానీ ఇంట ఏకంగా తొమ్మిది రోల్స్ రాయిస్ కార్లు ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే అంబానీ ఫ్యామిలీకి రోల్స్ రాయిస్ కార్ల మీద మక్కువ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. లంబోర్ఘిని, ఆడి వంటి స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం.