Indian Buys Mclaren 675 LT After Grand Mother Suggestion: ఏ కారు కొంటే బాగుంటుంది చెప్పు అని ఎప్పుడైనా.. మీ బామ్మను అడిగారా?, ఒక వేళా అడిగి ఉంటే.. నాకేం తెలుసు మనవడా అని చెప్పే బామ్మలే ఎక్కువగా ఉంటారు.. కదా!. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోతున్న బామ్మ మాత్రం, ఏకంగా మెక్‌లారెన్ కారును కోనేయ్ మనవడా అంటూ చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనిస్తే బామ్మ మెక్‌లారెన్ కారును కొనాలని చెప్పించి. పోర్స్చే కార్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయని, వాటికి డోర్స్ కూడా రెక్కలు మాదిరిగా లేదని చెబుతూ.. మెక్‌లారెన్ కారు కొనమని చెబుతుంది. బామ్మ మాట ప్రకారమే మనవడు ‘మెక్‌లారెన్ 765 ఎల్‌టీ’ (McLaren 765 LT) కొనుగోలు చేశాడు. ఈ కారు డెలివరీకి సంబంధించిన సంఘటనలను కూడా ఇక్కడ చూడవచ్చు.
బామ్మ కోసం మెక్‌లారెన్
ఈ కారును దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అయితే దీని ధర దుబాయ్‌లో కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారు కొనుగోలుతో మనవడు అతి చిన్న వయసులోనే మెక్‌లారెన్ 765 ఎల్‌టీ సొంత చేసుకున్న మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో చాలా తక్కువమంది మాత్రమే మెక్‌లారెన్ కారును కొనుగోలు చేశారు. ఇందులో బామ్మ మాట విన్న మనవడు కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ కారును డెలివరీ చేసుకునే సమయంలో ఆ మనవడి కుటుంబం మొత్తం అక్కడ ఉండటం చూడవచ్చు. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును కొనుగోలు చేసిన మూడో భారతీయుడు అయినప్పటికీ.. కేరళకు చెందిన మొదటి వ్యక్తి ఇతడే కావడం గమనించదగ్గ విషయం.
బామ్మ మాట విని రూ. 12 కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన మనవడు, ఆ కారును ఇండియాకు తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. నిజానికి ఈ కారు లిమిటెడ్ ఎడిషన్. కేవలం 765 మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు. ఈ కారు ధర ఎక్కువ కాబట్టి ప్రస్తుతానికి అన్ని యూనిట్లు పూర్తిగా అమ్ముడవ్వలేదు.
ఇండియాలోని మెక్‌లారెన్ 765 ఎల్‌టీ యజమానులు
ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ మొట్ట మొదటి మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును కొనుగోలు చేశారు. రెండో కారును బెంగళూరుకు చెందిన రంజిత్ సుందర్‌మూర్తి కొనుగోలు చేశారు. రెండు కారు దుబాయ్ నుంచి ఇండియాకు దిగుమతి అయినట్లు తెలుస్తోంది. ఇక మూడో కారు బామ్మ మాట విన్న మనవడే అని తెలుస్తోంది.
మెక్‌లారెన్ 765 ఎల్‌టీ
ప్రపంచ మార్కెట్లోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలిచిన మెక్‌లారెన్ కంపెనీకి చెందిన 765 ఎల్‌టీ 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 765 పీఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారు స్పైడర్ వెర్షన్ మాదిరిగా కూపే డిజైన్ పొందుతుంది. అయితే దీని బాడీ వర్క్ మొత్తం కార్బన్ ఫైబర్ నిర్మితం. ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, స్ప్లిటర్, సైడ్ స్కర్ట్స్, ర్యాప్‌రౌండ్ రియర్ బంపర్ వంటివన్నీ పొందుతుంది. ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. కాబట్టి ఈ సూపర్ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Also Read: మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్.. ఎందుకంటే?
అన్ని విధాలా అనుకూలంగా ఉండే మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును ధనవంతులు సైతం కొనడానికి వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం అధిక ధర. ఈ ఒక్క బ్రాండ్ కారు మాత్రమే కాకుండా చాలా ఖరీదైన బ్రాండ్ కార్ల పరిస్థితి కూడా ఇదే. కాబట్టి ఖరీదైన కార్ల అమ్మకాలు భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.
View this post on Instagram