భైరవం ట్రైలర్ లాంచ్: కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్

Manchu Manoj Bhairavam Movie: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భైరవం సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. అంతకంటే ముందు విడుదలైన ట్రైలర్ అభిమానులను ఎంతగానో మెప్పించింది. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ మరియు నారా రోహిత్ ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ భైరవం సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. సుమారు తొమ్మిదేళ్ల తరువాత మంచు మనోజ్ సినిమాలో కనిపించడం ఇదే మొదటిసారి.

ట్రైలర్ లాంచ్‌లో మంచు మనోజ్ భావోద్వేగం

భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పక్కనే ఉన్న డైరెక్టర్ ఆయనను (మనోజ్) ఓదార్చారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాలో.. అతిధి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటించారు.

ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను

ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “నాపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి చాలా రుణపడి ఉంటాను.” తన కుటుంబంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని ఈ సందర్బంగా బాధపడ్డారు. “తెర మీద కనిపించి 9 సంవత్సరాలు అయింది. అయినవాళ్లు అందరూ కాదనుకున్నారు, దూరం పెట్టేసారు. కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టేశారు. అలాంటి సమయంలో భైరవం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఎన్ని జన్మలెత్తినా.. డైరెక్టర్ ఋణం తీర్చులేను” అని మంచు మనోజ్ అన్నారు.

11 నెలల వయసులోనే సినిమాలోకి

“చాన్నాళ్లుగా సినిమాలకు దూరంగానే ఉన్నాను. కరోనా మహమ్మారి సమయంలో కొన్ని సినిమాలను ఆపేయాల్సి వచ్చింది. వ్యక్తిగత కారణాల వల్ల మరికొన్ని సినిమాలను ఆపేయాల్సి వచ్చింది. నాకు సినిమా తప్పా వేరే ప్రపంచం తెలియదు. 11 నెలల వయసు ఉన్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టాను. 19 ఏళ్ల వయసులో దొంగ దొంగది సినిమాలో నటించాను. ఆ తరువాత ఎన్ని సినిమాల్లో నటించాను. ఈ మధ్య కాలంలో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.”

అభిమానులే నా కుటుంబం

“ఈ వేదికపై నుంచి ఎంతో చెప్పాలనుకున్న.. కానీ మాటలు రావడం లేదు. నేను మీకోసం డబ్బు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ నీ మీద మీరు అపారమైన ప్రేమ కురిపిస్తున్నారు. గొడవలు జరిగినప్పుడు కూసే నాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మీడియాకు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా మద్దతుగా నిలిచారు. నాకు ఇప్పుడు పెద్ద కుటుంబం లేదు. ఉన్నది నా ఇద్దరు పిల్లలు, భార్య మాత్రమే. నా పిల్లలు ఎక్కడ నీ కుటుంబం అంటే.. తప్పకుండా మిమ్మల్నే చూపిస్తా. ఇదే నా కుటుంబం అని చెబుతా..” అంటూ మంచి నమోజ్ ఎమోషనల్ అయ్యారు.

శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు..

భైరవం చాలా మంచి సినిమా. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు నటించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ (విజయ్ కనకమేడల) తలచుకుంటే.. ఎంతోమంది నటులను తీసుకోగలడు. కానీ నాకు అవకాశం ఇచ్చాడు. “శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు, ఆయన్ని మనసారా తలచుకుంటే.. మీ అందరి రూపంలో వస్తాడు” అని మంచు మనోజ్ చెప్పాడు. బెల్లంకొండ శ్రీనివాస్ నాకు తమ్ముడిగా ఎందుకు పుట్టలేదు అని అనుకుంటున్నారా.. కానీ ఎప్పుడూ నీకు అన్నయ్యగా నేను నిలబడతాను. నారా రోహిత్ నాకు మంచి ఫ్రెండ్ అని చెబుతూ.. ఎప్పటికీ నేను మోహన్ బాబు కొడుకునే అని అన్నారు మనోజ్.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *