రేటు తగ్గినా.. రూ.లక్షకు తగ్గని బంగారం: నేటి కొత్త ధరలివే!

Today Gold and Silver Price: ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో పసిడి ప్రేమికులు ఎక్కువే. చాలామంది బంగారాన్ని కేవలం ఒక ముడిపదార్థంగా పరిగణిస్తే, భారతీయులు మాత్రం దానిని పవిత్రంగా భావించి, ఆభరణాలుగా ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సాంస్కృతిక అనుబంధం కారణంగానే మన దేశంలో బంగారు ఆభరణాలు లేదా బంగారం ధరలు తరచుగా పెరుగుతూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, నిన్న (ఆదివారం) స్థిరంగా ఉండి, నేడు (జూన్ 16) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు (జూన్ 16)

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు కొంతమేర తగ్గాయి. ఈ రోజు (జూన్ 16) నాటి ధరల వివరాలు:

  • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 150 తగ్గి, రూ. 93,050 వద్ద స్థిరపడింది.
  • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 170 తగ్గి, రూ. 1,01,510 వద్ద నిలిచింది. ఇదే విధమైన ధరల సరళి బెంగళూరు, చెన్నై మరియు ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతోంది.

ఢిల్లీలో పసిడి ధరల తాజా పరిస్థితి

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి:

  • 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 150 తగ్గి, రూ. 93,200 వద్ద ఆగింది.
  • 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 170 తగ్గి, రూ. 1,01,660 వద్ద నిలిచింది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న పసిడి ధరలు, నేడు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని రోజులుగా బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో అమాంతం పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర లక్ష రూపాయలు దాటింది.

ప్రధాన నగరాల్లో వెండి ధర

హైదరాబాద్, విజయవాడ, చెన్నై, ముంబై మరియు బెంగుళూరులలో.. వెండి రేటు 100 రూపాయలు మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ కేజీ సిల్వర్ రేటు రూ. 1,19,900 వద్ద నిలిచింది.

ఢిల్లీలో వెండి ధర

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. వెండి రేటు ఢిల్లీలో కొంత తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి రేటు రూ. 1,09,900 దగ్గర ఉంది. దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో వెండి రేటు ఎంత తగ్గువగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

బంగారం ధరల పెరుగుదలకు గల కారణాలు

బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • భౌగోళిక మరియు రాజకీయ అనిశ్చితులు: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
  • డిమాండ్ మరియు సరఫరా: మార్కెట్లో డిమాండ్‌కు తగినంత బంగారం అందుబాటులో లేకపోవడం ధరల పెరుగుదలకు దారితీస్తుంది. కొనుగోలుదారుల సంఖ్య ఎక్కువగా ఉండి, లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ధరలు సహజంగానే పెరుగుతాయి.
  • పెట్టుబడిగా బంగారం: చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు, వారు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు, ఇది కూడా ధరల పెరుగుదలకు ఒక ప్రధాన కారణం.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *