సందీప్ రెడ్డి వంగా కొన్న కొత్త కారు
టాలీవుడ్ మరియు బాలీవుడ్లో తనదైన మార్క్ సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా కొనుగోలు చేసిన లగ్జరీ కారు ‘మినీ కూపర్’ (Mini Cooper). దీని ధర సుమారు రూ. 50 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. సాధారణంగా సెలబ్రిటీలు బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి లేదా రేంజ్ రోవర్ వంటి కార్లను ఎక్కువగా ఇష్టపడుతుండగా, సందీప్ రెడ్డి వంగా మాత్రం స్టైలిష్ మరియు కాంపాక్ట్ లగ్జరీ కారు అయిన మినీ కూపర్‌ను ఎంచుకోవడం విశేషం.
మినీ కూపర్ – సెలబ్రిటీల ఛాయిస్
మినీ కూపర్ కారు భారతదేశంలో చాలా మంది సెలబ్రిటీల మనసు దోచుకుంది. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొనే వంటి తారల గ్యారేజీలలో ఈ కారు దర్శనమిస్తుంది. దీన్నిబట్టి ఈ కారుకు మార్కెట్లో ఉన్న క్రేజ్ మరియు డిమాండ్ అర్థం చేసుకోవచ్చు.
సందీప్ రెడ్డి వంగా తన కొత్త మినీ కూపర్ కారును డెలివరీ తీసుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తన భార్యతో కలిసి ఉండటం చూడవచ్చు. వారు కొనుగోలు చేసిన ఆకుపచ్చ రంగు మినీ కూపర్ ఆకర్షణీయమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. కొత్త కారుకు శాస్త్రోక్తంగా పూజలు చేయించడానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇండియాలోని మినీ కార్లు
మినీ బ్రాండ్ కార్లు వాటి ప్రత్యేకమైన డిజైన్ మరియు డ్రైవింగ్ అనుభూతికి ప్రసిద్ధి. పరిమాణంలో ఇవి చిన్నగా కనిపించినప్పటికీ, అద్భుతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో వస్తాయి. అందుకే వీటి ధరలు కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. మార్కెట్లో మినీ కూపర్, మినీ కంట్రీమ్యాన్, మినీ కూపర్ ఎస్ఈ (ఎలక్ట్రిక్), మరియు మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ వంటి విభిన్న మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.
సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ప్రాజెక్ట్ – ‘స్పిరిట్’
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘స్పిరిట్’ (Spirit) అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) హీరోయిన్గా నటించనుంది. సుమారు ఆరు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ‘స్పిరిట్’ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
Leave a Reply