Tag: Mercedes AMG GT 63

  • ఈ నెలలో (జూన్) లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే: పూర్తి వివరాలు

    ఈ నెలలో (జూన్) లాంచ్ అయ్యే కొత్త కార్లు ఇవే: పూర్తి వివరాలు

    Upcoming Car Launches in India June 2025: 2025 ప్రారంభమై ఐదు నెలలు పూర్తయింది. ఆరో నెల కూడా మొదలైపోయింది. ఇప్పటికే దేశీయ విఫణిలో లెక్కకు మించిన కార్లు లాంచ్ అయ్యాయి. ఈ నెలలో కూడా మరికొన్ని కార్లు లాంచ్ కావడానికి సిద్ధమయ్యాయి. ఇందులో టాటా కారు, మెర్సిడెస్ బెంజ్ కార్లు ఉన్నాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

    టాటా హారియార్ ఈవీ (Tata Harrier EV)

    దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న కార్లలో టాటా మోటార్స్ యొక్క ‘హారియార్ ఈవీ’ (Harrier EV) ఒకటి. 2025 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ ఎలక్ట్రిక్ కారు.. ఈ నెలలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. కాగా.. ధరలు మాత్రం వచ్చే నెలలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

    డిజైన్ & ఫీచర్లు

    విడుదలకు సిద్దమవుతున్న కొత్త టాటా హారియార్, సీల్ట్ గ్రిల్, కనెక్టెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, షార్పర్ టెయిల్ ల్యాంప్ ఎల్ఈడీ లైట్స్, ఏరో ఫ్రెండ్లీ అల్లాయ్ వీల్స్ వంటివన్నీ పొందుతుంది. ఈ కారులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలైన ఫీచర్స్ ఉంటాయి.

    పర్ఫామెన్స్ మరియు రేంజ్

    టాటా హారియార్ ఈవీఅనేది .. ఒమేగా ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి ఉంటుంది. ఈ కారు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే డ్యూయెల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ పొందుతుంది. అయితే కంపెనీ బ్యాటరీ స్పెక్స్ గురించి వెల్లడించలేదు. అయినప్పటికీ.. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.

    మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ (Mercedes AMG G63 Collector’s Edition)

    ఈ కారును కంపెనీ జూన్ 12న దేశీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇది భారతీయ సంస్కృతి మరియు సౌందర్యశాస్త్రం నుంచి ప్రేరణ పొందిన కాస్మెటిక్ అప్డేట్స్ పొందుతుంది. దీనికి కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్పెషల్ అపోల్స్ట్రే.. బే స్పోక్ పెయింట్ ఫినిషింగ్ వంటివి ఉన్నాయి.

    ఇంజిన్ మరియు పనితీరు

    కాస్మొటిక్ అప్డేట్స్ ఉన్నప్పటికీ.. యాంత్రికంగా ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. కాబటికి ఈ కొత్త మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కలెక్టర్స్ ఎడిషన్ కారులో 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ద్వారా 585 హార్స్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ కలిగి.. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కూడా పొందుతుంది.

    అంచనా ధర

    కంపెనీ ఈ కొత్త కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ధర రూ. 3.64 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.

    మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 అండ్ ప్రో (Mercedes AMG GT 63 And Pro)

    ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టనున్న మరో కారు.. మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 అండ్ ప్రో. ఇది జూన్ 27న ఇండియన్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది ”స్టాండర్డ్ 63 4మ్యాటిక్ ప్లస్, స్ట్రాంగ్ జీటీ 63 ప్రో 4 మ్యాటిక్” అనే రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 2+2 సీటింగ్ లేఅవుట్, ఎక్కువ బూట్ స్పేస్ మరియు టెక్ రిచ్ క్యాబిన్ వంటివి పొందుతుంది.

    ఇంజిన్ మరియు పనితీరు

    కొత్త మెర్సిడెస్ ఏఎంజీ జీటీ 63 అండ్ ప్రో కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. జీటీ 63 వేరియంట్ 585 హార్స్ పవర్ మరియు 800 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. జీటీ 63 ప్రో వేరియంట్ 612 హార్స్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. జీటీ 63 టాప్ స్పీడ్ 315 కిమీ / గం కాగా.. ప్రో వేరియంట్ టాప్ స్పీడ్ 317 కిమీ / గం. ఈ రెండు వేరియంట్లు 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతాయి.