వాహన ప్రియులకు శుభవార్త.. సరికొత్త హీరో బైక్ వచ్చేసింది: రూ.10000 తక్కువ

2024 Hero Xtreme 160R 2V launched in India: భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) కొన్ని నెలల క్రితం ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైకును అప్డేట్ చేసి మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కొన్ని స్వల్ప అప్‌డేట్‌లతో ‘ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ’ (Xtreme 160R 2V) లాంచ్ చేసింది.

ధర (Price)

హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైక్ ధర రూ. 1.11 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ధర దాని మునుపటి మోడల్ కంటే రూ. 10,000 తక్కువ. ఇది స్టెల్త్ బ్లాక్ కలర్ స్కీమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పండుగ సీజన్‍లో అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీ ఈ బైకును తక్కువ ధర వద్ద లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.

డిజైన్ (Design)

చూడటానికి దాని స్టాండర్డ్ బైకు మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇందులో సూక్షమైన అప్డేట్స్ గుర్తించవచ్చు.టెయిల్ లాంప్ డిజైన్ కొంత అప్డేట్ పొందింది. అయితే హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ అన్నీ కూడా సాధారణ బైకు మాదిరిగానే ఉన్నాయి. సీట్ డిజైన్ కూడా ఎలాంటి మార్పు పొందలేదు. సింగిల్ పీస్ సీటు అయినప్పటికీ.. స్టెప్ అప్ మాదిరిగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

ఇక్కడ గమనించాల్సిన అదిపెద్ద అప్డేట్ ఏమిటంటే డిజిటల్ డ్యాష్ రెండు మోడ్‌లతో డ్రాగ్ రేస్ టైమర్ పొందుతుంది. ఈ బైక్ యొక్క వెనుక భాగంలో సింగిల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. టెలిస్కోపిక్ పోర్క్ మరియు మోనోషాక్ సెటప్ కలిగిన ఈ బైక్ 100/80-17 సెక్షన్ ఫ్రంట్ మరియు 130/70 ఆర్17 రియర్ టైర్ పొందుతుంది.

అప్డేటెడ్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు. సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. సీటు ఎత్తు మునుపటి కంటే కూడా కొంత తగ్గించబడి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇది రైడర్లకు అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంజిన్ వివరాలు (Engine Details)

2024 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైక్ యొక్క ఇంజిన్ ఎటువంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి అదే 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 15 హార్స్ పవర్ మరియు 6500 rpm వద్ద 14 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరుని అందిస్తుంది.

ప్రత్యర్థులు (Rivals)

భారతీయ విఫణిలో బజాజ్ పల్సర్ ఎన్150 మరియు యమహా కంపెనీ యొక్క ఎఫ్‌జెడ్ శ్రేణి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ.. మార్కెట్లో ఎలాంటి అమ్మకాలు పొందుతుందో చూడాలి. ధర తక్కువే కాబట్టి ఈ బైక్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

అప్డేటెడ్ బైకులు లాంచ్ చేయడానికి కారణం

వాహన ప్రియులు ఎప్పటికప్పుడు కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హీరో మోటోకార్ప్ కూడా 2024 ఎక్స్‌ట్రీమ్ బైక్ లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ.. అధిక ప్రజాదరణ పొందుతున్న కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైకును రూ. 10000 తక్కువ ధరకే లాంచ్ చేసింది.

Don’t Miss: చిన్న కారు కొన్న పెద్ద హీరోయిన్.. దీని రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు

హీరో మోటోకార్ప్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో అత్యుత్తమ మైలేజ్ అందించే బైకులను లాంచ్ చేసి అధిక అమ్మకాలు పొందుతోంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు.. ఈ రోజుకు కూడా హీరో మోటోకార్ప్ యొక్క వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అంటే.. ఈ కంపెనీకి దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.