TVS Jupiter 110 Launched in India: ఆధునిక భారతదేశంలో కొత్త వాహనాలను డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) కంపెనీ తాజాగా సరికొత్త ‘జుపీటర్ 110’ (Jupiter 110) స్కూటర్ లాంచ్ చేసింది. 2013 నుంచి అత్యధిక అమ్మకాలు పొందుతూ దూసుకెళ్తున్న టీవీఎస్ జుపీటర్ ఇండియాలో అత్యధిక అమ్మకాలు పొందిన రెండవ స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా కంపెనీ దీనిని జుపీటర్ 110 పేరుతో లాంచ్ చేసింది. ఇది చూడటానికి కొంతవరకు స్టాండర్డ్ జుపీటర్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు.
ధరలు (Price)
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ ప్రారంభ ధర రూ. 73700 (ఎక్స్ షోరూమ్). కంపెనీ తన జుపీటర్ స్కూటర్ లాంచ్ చేసిన సుమారు 11 సంవత్సరాల తరువాత ఈ జుపీటర్ 110 లాంచ్ చేసింది. ఇది దాని స్టాండర్డ్ వేరియంట్ కంటే తక్కువ ధర, అధిక ఫీచర్స్ కలిగి ఉన్నట్లు సమాచారం.
వేరియంట్స్ (Variants)
కొత్త టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టీల్ వీల్స్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ (రూ. 73700), అల్లాయ్ వీల్స్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ (రూ. 79200), స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ యాప్ ఇంటిగ్రేషన్‌తో కూడిన డ్రమ్ బ్రేక్ (రూ. 83250), ఒక స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ ఇంటిగ్రేషన్‌తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెర్షన్ (రూ. 87250) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ.
డిజైన్ (Design)
ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే 2024 టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ దాని స్టాండర్డ్ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో ఇన్ఫినిటీ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఆఫ్రాన్ కూడా కొంత పెద్దదిగా ఉండటం చూడవచ్చు. ఇండీగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా డీఆర్ఎల్ డిజైన్ మాదిరిగా ఉంటుంది.
డైమెన్షన్స్ లేదా కొలతలు (Dimensions)
కొత్త జుపీటర్ 110 దాని మునుపటి మోడల్ కంటే కూడా పొడవుగా ఉంటుంది. వీల్‌బేస్ మునుపటి మాదిరిగానే 1275 మిమీ వద్ద ఉంటుంది. సీటు ఎత్తు 770 మిమీ మాత్రమే. గ్రౌండ్ క్లియరెన్స్ 163 మిమీ, ఈ స్కూటర్ మొత్తం బరువు (కర్బ్) 105 కేజీలు మాత్రమే. అంటే ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా తేలికగా ఉంటుంది.
2024 జుపీటర్ 110 స్కూటర్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ ఇప్పుడు ఫ్లోర్‌బోర్డ్‌లో ఉంది. ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ ముందు భాగంలో ఉంటుంది, అయితే ఇది స్టాండర్డ్ స్కూటర్ కంటే చిన్నదిగా ఉంటుంది. అండర్ సీట్ స్టోరేజ్ 33 లీటర్ల వరకు ఉంటుంది. సీటు కూడా కొంత పొడవుగా ఉంటుంది.
ఫీచర్స్ (Features)
టీవీఎస్ జుపీటర్ యొక్క 110 స్కూటర్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది హై స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఎంట్రీ లెవెల్ మోడల్స్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతాయి. కలర్ ఎల్‌సీడీ క్లస్టర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు మ్యాప్ మై ఇండియా బేస్డ్ టర్న్ బై టర్న్ న్యావిగేషన్ ఉంటాయి. వీటితో పాటి టాప్ వేరియంట్ స్మార్ట్‌ఎక్స్‌నెక్ట్ మొబైల్ యాప్ ద్వారా ‘ఫైండ్ మీ’ ఫంక్షన్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
ఇంజిన్ (Engine)
ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం ఇంజిన్.. టీవీఎస్ జుపీటర్ 110 స్కూటర్ 109.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 9.2 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఇంటిగ్రేటెడ్ స్టార్ – స్టాప్ సిస్టం పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ అనేది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది.
Don’t Miss: కార్ల వినియోగంలో కూడా మెగాస్టారే.. చిరంజీవి గ్యారేజిలోని కార్లు చూశారా?
టీవీఎస్ కొత్త జుపీటర్ 110 స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు మోనోషాక్ సెటప్ పొందుతుంది. టాప్ వేరియంట్ 220 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. కానీ మిగిలిన అన్ని వేరియంట్లు డ్రమ్ రియర్ బ్రేక్ పొందుతాయి. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం ఆఫర్‌లో లేదు. ఇది 12 ఇంచెస్ వీల్స్ మరియు 90/90 సెక్షన్ టైర్స్ పొందుతుంది.