2025 Honda SP 125: కొత్త ఏడాది.. సరికొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఇది చూడండి

2025 Honda SP 125 Launched in India: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన యాక్టివా 125 స్కూటర్ యొక్క అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేసిన తరువాత.. ‘2025 హోండా ఎస్పీ 125’ (2025 Honda SP 125) యొక్క అప్డేటెడ్ మోడల్ కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త 2025 మోడల్ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు

2025 హోండా ఎస్పీ 125 మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 91,771 మరియు రూ. 1,00,284 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అప్డేట్ మోడల్ ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్టాండర్డ్ మోడల్స్ కంటే రూ. 4,000 మరియు రూ. 8,816 ఎక్కువని స్పష్టమవుతోంది.

కలర్ ఆప్షన్స్

2025 హోండా ఎస్పీ 125 బైక్ మొత్తం ఐదు కొత్త కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూ, ఇంపీరియర్ రెడ్ మెటాలిక్ మరియు మ్యాట్ మర్వెల్ బ్లూ మెటాలిక్. అప్డేటెడ్ హోండా ఎస్పీ125 ఇన్ని రంగులలో లభిస్తుంది, కాబట్టి కొనుగోలుదారుడు తనకు నచ్చిన కలర్ ఎందుకోవచ్చు.

ఇంజిన్ డీటైల్స్

అప్డేటెడ్ హోండా ఎస్పీ 125 బైక్ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలమైన అప్డేట్స్ పొందింది. కాబట్టి ఇందులోని 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ 11 హార్స్ పవర్ మరియు 11 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది కఠినమైన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ అయినప్పటికీ.. పనితీరు లేదా పర్ఫామెన్స్ పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

డిజైన్ మరియు ఫీచర్స్

చూడటానికి సాధారణ హోండా ఎస్పీ 125 మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. 2025 మోడల్ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ పొందుతుంది. ఫ్రంట్ ఎండ్ మరియు టెయిల్ సెక్షన్ రెండూ కూడా కొంత అప్డేట్ అయ్యాయి. మిగిలిన డిజైన్ మొత్తం మునుపటి మోడల్ బైకును గుర్తుకు తెస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. స్టాండర్డ్ మోడల్ బైకులో ఉన్న అన్ని ఫీచర్స్ ఈ 2025 ఎస్పీ 125 బైకులో ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు 4.2 ఇంచెస్ TFT స్క్రీన్ కూడా ఈ బైకులో ఉంటుంది. కాబట్టి రైడర్ ఈ స్క్రీన్ మీద టర్న్ బై టర్న్ న్యావిగేషన్యాక్సెస్ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ బైకులో USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. రైడింగ్ చేస్తున్న సమయంలో కూడా మొబైల్ వంటి వాటిని ఛార్జ్ చేసుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

మెకానికల్స్

డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కొంత అప్డేట్స్ పొందినప్పటికీ.. మెకానికల్స్ లేదా హార్డ్‌వేర్ ప్యాకేజీలో కూడా ఎటువంటి మార్పు లేదు. కాబట్టి 2025 హోండా ఎస్పీ 125 బైక్ అదే టెలిస్కోపిక్ పోర్క్, డ్యూయెల్ స్ప్రింగ్, 17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 116 కేజీలు కాగా ఫ్యూయెల్ ట్యాంక్ 11.2 లీటర్లు. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Also Read: 2025 Honda Activa 125: వచ్చేసింది సరికొత్త యాక్టివా.. ధర కూడా తక్కువే!

నిజానికి హోండా ఎస్పీ 125 బైక్ కొంత తక్కువ ధరకు లభించడమే కాకుండా.. అత్యుత్తమ మైలేజ్ కూడా అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. కాగా ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన 2025 మోడల్.. దాని మునుపటి మోడల్ కంటే కొంత అప్డేటెడ్ డిజైన్ పొందటమే కాకుండా, TFT స్క్రీన్ కూడా పొందింది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మకాలు కూడా ఉత్తమాంగానే ఉంటాయని భావిస్తున్నాము.

కొత్త హోండా ఎస్పీ 125 బైక్ గురించి మా అభిప్రాయం

2025 సంవత్సరం త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ తరువాత సంక్రాతి, ఉగాది వరుసగా రానున్నాయి. అలాంటి పండుగల సందర్భంలో కొంత తక్కువ ధరకు లభించే బైక్ కొనాలని వేచి చూసేవారికి ‘హోండా ఎస్పీ 125’ ఓ మంచి ఆప్షన్ అవుతుందని తెలుస్తోంది. ఈ బైక్ 65 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

Leave a Comment