2025 Kia Syros SUV Revealed: అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘కియా మోటార్స్’ (Kia Motors) ఎట్టకేలకు ‘సిరోస్’ (Syros) ఎస్‌యూవీ ఆవిష్కరించింది. సిరోస్ అనేది భారతీయ కంపెనీ యొక్క రెండవ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ సరికొత్త కియా కారు డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ మరియు ధరల వంటి వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
బుకింగ్స్ & వేరియంట్స్
దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త కియా సిరోస్ ఎస్‌యూవీ కోసం కంపెనీ 2025 జనవరి 3 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. కాగా డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. ఆ సమయంలో కంపెనీ కియా సిరోస్ ధరలను అధికారికంగా వెల్లడించనుంది. ఈ కారు HTK, HTK (O), HTK+, HTX, HTX+ మరియు HTX+(O) అనే వేరియంట్లలో లభిస్తుంది.
ఎక్స్‌టీరియర్ డిజైన్
కియా సిరోస్ కారు చూడటానికి చాలా కొత్త డిజైన్ పొందుతుంది. చూడగానే ఆకర్శించబడే ఫ్రంట్ డిజైన్, బంపర్ అంచుల వద్ద నిలువుగా పేర్చబడిన హెడ్‌ల్యాంప్‌లు, ఎయిర్ ఇన్‌టేక్ దిగువ బ్లాక్ అవుట్ చూడవచ్చు. ముందు భాగం చూడగానే ఇది ఎలక్ట్రిక్ కారేమో అనే భ్రమ కలుగుతుంది.
ఈ కొత్త కియా కారు యొక్క వీల్ ఆర్చ్‌లపైన చంకీ ప్లాస్టిక్ క్లాడింగ్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, వెనుక భాగంలో ఎల్ షేప్ టెయిల్ లైట్ ఉంటుంది. వెనుక బంపర్ డ్యూయెల్ టోన్ పొందుతుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఇది ఓ కొత్త డిజైన్ పొందినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇంటీరియర్ ఫీచర్స్
కొత్త కియా సిరోస్ కారులో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయెల్ 12.3 ఇంచెస్ డిస్‌ప్లేలు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ కోసం 5 ఇంచెస్ స్క్రీన్ ఉంది. టూ స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, HVAC కంట్రోల్ కోసం ఫిజికల్ బటన్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్, యాంబియంట్ లైటింగ్ వంటివన్నీ కూడా ఈ కారులో ఉన్నాయి.
పైన చెప్పుకున్న ఫీచర్స్ కాకుండా సిరోస్ కారులో.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కోసం ఓటీఏ అప్‌డేట్‌లు, నాలుగు వెంటిలేటెడ్ సీట్లు, సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన రిక్లైనింగ్ మరియు స్లైడింగ్ సెకండ్ రో సీట్లు, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ ఫంక్షన్, పవర్డ్ డ్రైవర్ సీటు, 8 స్పీకర్ హార్మాన్ కార్డాక్ సౌండ్ సిస్టం, డ్యూయెల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్ డీటైల్స్
కియా సిరోస్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.0 లీటర్ టీ-జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ సీఆర్డీఐ టర్బో డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డీసీటీ ద్వారా 120 హార్స్ పవర్ 172 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 116 హార్స్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తుంది.
Also Read: 25 సంవత్సరాలుగా తిరుగులేని మోడల్: 32 లక్షల మంది కొన్న ఏకైక కారు ఇదే
అంచనా ధర మరియు ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కియా సిరోస్ (Kia Syros).. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3ఎక్స్ఓ, మారుతి బ్రెజ్జా, స్కోడా కైలాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన తరువాత మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రభావం బహుశా అమ్మకాల మీద పడే అవకాశం ఉంది.