శుక్రవారం (25 ఏప్రిల్): ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, శుక్రవారం (25 ఏప్రిల్). రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు, యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు, దుర్ముహూర్తం 8:24 నుంచి 9:12 వరకు. తిథి ద్వాదశి 24వ తేదీ ఉదయం 6:45 నుంచి 25వ తేదీ ఉదయం 8:21 వరకు.. తరువాత త్రయోదశి. నేటి రాశిఫలాల విషయానికి వస్తే..

మేషం

అధిక కష్టం.. అల్ప ఫలితం. ఇంటాబయట ప్రతికూల ప్రభావం. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సన్నిహితులతో వివాదాలు జరిగే అవకాశం. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో అధిక ఒత్తిడి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.

వృషభం

ముఖ్యమైన పనులు అప్రయత్నంగానే పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సన్నిహితును కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు, నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.

మిథునం

ఆదాయానికి మించిన ఖర్చులు, ముఖ్యమైన పనులు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలహాలు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి వాతావరణం. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటకం

ఇంటాబయట ప్రతికూల వాతావరణం, మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

సింహం

తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులను కలిగిస్తాయి. సమస్యలు అధికమవుతాయి. స్థిరాస్తి వివాదాలు, వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తద్వారా.. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కన్య

సన్నిహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం మీదే. వ్యాపారంలో ఆశించిన లాభాలు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

తుల

ఇంటాబయట అనుకూల వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు భవిష్యత్తులో ఇబ్బందులు కలిగిస్తాయి.

వృశ్చికం

ప్రతికూల వాతావరణంలో ఉండాల్సి వస్తుంది. ధైర్యంతో నిలబడాలి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగ, వ్యాపారంలో కూడా ఆదరణ తగ్గుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయులే మిమ్మల్ని బాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగంలో ఒత్తిడి వాతావరణం, అధికారులతో జాగ్రత్తగా వ్యాహరించాల్సిన సమయం. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

మకరం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితిని ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం

ఇంటాబయట అనుకూల వాతావరణం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

మీనం

మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో అధిక పనిభారం, అయినప్పటికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారభించకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, దైవ చింతన పెరుగుతుంది.

గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఎందుకంటే రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి ఫలితాల్లో మార్పులు రావొచ్చు. పాఠకులు ఈ విషయం తప్పకుండా.. గుర్తుంచుకోవాలి.

Leave a Comment