ప్రభాస్ ‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది: డైరెక్టర్ మారుతి ట్వీట్ వైరల్

ప్రముఖ నటుడు ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్‘ (The Raja Saab) సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరమీదకు వస్తుందా అని.. ఎంతోమంది అభిమానులు వేచి చూస్తున్నారు.అయితే ఇప్పటివరకు టీజర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మే నెలలో విడుదలవుతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డైరెక్టర్ మారుతి చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొట్టేస్తోంది.

డైరెక్టర్ మారుతి ట్వీట్

ఒక ఆటో వెనుక ఉన్న ది రాజాసాబ్ పోస్టర్‌ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. హై అలర్ట్..!! మే నెల మధ్యలో వేడిగాలులు మరింత పెరగనున్నాయి అని మారుతి ట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మే నెలలోనే సినిమా టీజర్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే మారుతి ఇచ్చిన హింట్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ అన్నీ పూర్తయినట్లు సమాచారం. ప్రభాస్ విదేశాల నుంచి తిరిగి రాగానే.. డబ్బింగ్ పనులు మొదలవుతాయని చెబుతున్నారు. ఆ తరువాత టీజర్ లాంచ్ ఉంటుంది. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని కూడా చిత్ర బృందం అధికారికంగా వెల్లడించనుంది.

ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాలో.. రెబల్ స్టార్ రెండు పాత్రలలో కనిపించే అవకాశం ఉంది. రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు, ఈ ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే.. ప్రభాస్ ఖాతాలో మరో హిట్ జమయినట్లే అవుతుంది.

Also Read: బ‌ర్త్‌డేకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భార్య – ఆనందంతో తేలిపోయిన భర్త (వీడియో)

నటుడు ప్రభాస్ గురించి

ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు అలియాస్ ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టాడు. ఆ తరువాత రాఘవేంద్ర, వర్షం, అడవి రాముడు మరియు చక్రం వంటి సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుని.. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాతో పాపులర్ అయ్యాడు. ఆ తరువాత బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నారు. నటనతో ఎంతోమందిని మెప్పించిన ప్రభాస్.. లెక్కకు మించిన అవార్డులను సొంతం చేసుకున్నాడు. కాగా ఇక త్వరలోనే ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము.

Leave a Comment