వచ్చేస్తోంది ఓలా సరికొత్త స్పోర్ట్ బైక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు

Ola Electric Sports Bike: భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ (Ola Electric) ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు ఈ బైకుకు సంబంధించిన ఫోటోలను సంస్థ సీఈఓ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ స్వయంగా షేర్ చేసిన ‘ఓలా యారోహెడ్ బైక్’ కాన్సెప్ట్ ఫోటోలను గమనిస్తే.. పసుపు రంగులో చూడటానికి అద్భుతంగా కనిపించే స్పోర్ట్స్ బైక్ కనిపిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. రైడింగ్ చేయడానికి త్వరలో వచ్చేస్తున్నాయి అని పేర్కొన్నారు. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. సంబరపడిపోతున్నారు. నాకు ఇలాంటిదే రెడ్ కలర్ బైక్ కావాలని.. ఒకరు కామెంట్ చేశారు. అయితే ఈ బైక్ ఎన్ని రంగులలో అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని సీఈఓ వెల్లడించలేదు.

బాణం గుర్తుతో..

భవిష్ అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలను గమనిస్తే.. బాణం గుర్తు వంటి ఆకారం చూడవచ్చు. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్, విశాలమైన హ్యాండిల్ బార్ మొదలైనవి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఇది తప్పకుండా బైక్ ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉందని అర్థమవుతోంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ ఉత్పత్తిని ప్రారంభించేసింది. కాబట్టి డెలివరీలు కూడా ఏడాదిలోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము.

సరికొత్త డిజైన్.. యువతను ఆకట్టుకునే స్టైల్ పొందిన ఈ స్పోర్ట్ బైక్.. కంపెనీ యొక్క గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ బైకులు కూడా మోటార్‌సైకిల్స్ విభాగంలో కూడా తప్పకుండా ఓ హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉందనిపిస్తోంది. అయితే ఈ బైక్ గురించి చాలా వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఫీచర్స్

త్వరలో మార్కెట్లో అడుగుపెట్టనున్న సరికొత్త ఓలా ఎలక్ట్రిల్ స్పోర్ట్ బైక్.. అధునాతన ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇందులో మూవ్ఓఎస్ 5 (MoveOS 5) ఉండనుంది. అంతే కాకుండా ఇది న్యావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, రోడ్ ట్రిప్ మోడ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. వీటితో పాటు ఇది స్మార్ట్ ఛార్జింగ్, స్మార్ట్ పార్క్, వాయిస్ అసిస్టెంట్‌తో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం అలర్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బైక్ వినియోగదారులకు చాలా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయని స్పష్టమవుతోంది.

ఓలా సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్ బైక్ లాంచ్ చేసిన తరువాత.. మార్కెట్లో రెవోల్ట్ ఆర్‌వీ 400, కబీరా స్కూటర్స్ కేఎమ్ 3000 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ స్పెసిఫికేషన్స్ మరియు ధరకు సంబంధించిన చాలా వివరాలను వెల్లడించాల్సి ఉంది. అంతే కాకుండా ఈ బైక్ రేంజ్ గురించి కూడా కంపెనీ ప్రస్తావించాల్సి ఉంది. మొత్తం మీద ఈ బైక్ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందని మాత్రం స్పష్టమవుతోంది.

అంచనా ధర

కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త స్పోర్ట్స్ బైక్ ధర రూ. 1.50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఆన్ రోడ్ ధర రూ. 20000 ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఖచ్చితంగా ధరల గురించి తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన అన్ని వాహనాల కంటే.. భవిష్ అగర్వాల్ షేర్ చేసిన బైక్ చాలా భిన్నంగా మరియు ఆకర్షణీయంగా ఉంది.

Also Read: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్.. భారతీయ మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ప్రారంభం నుంచి గొప్ప అమాంకాలతో ముందుకు దూసుకెళ్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఈ బైక్ లాంచ్ చేస్తే, అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనిని కంపెనీ 2025లో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Leave a Comment