అందరికీ ఇష్టమైన కారు.. ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగులతో: రేటెంతంటే?

2025 Maruti Alto K10 Launched: భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన కారు, దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రాండ్ మారుతి సుజుకి యొక్క ఆల్టో. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న సరసమైన కార్లలో ఇది కూడా ఒకటి. అయితే కంపెనీ ఇప్పుడు ‘మారుతి ఆల్టో కే10’ (Maruti Alto K10) కారుని ఆరు ఎయిర్‌బ్యాగులతో తీసుకొచ్చింది. కాబట్టి దీని ధర ఎంత? అప్డేటెడ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? అనే వివరాలను క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

ధరలు

ఆరు ఎయిర్‌బ్యాగులు కలిగిన మారుతి ఆల్టో కే10 ధరలు.. స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 16000 ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఈ కారు ప్రారంభ ధర రూ. 4.23 లక్షలు (ఎక్స్ షోరూమ్), ధరల పెరుగుదలకు ముందు.. ఈ కారు ధర రూ. 4.09 లక్షలు. స్టాండర్డ్ వేరియంట్ ధరలు మాత్రమే కాకుండా.. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ మరియు వీఎక్స్ఐ ప్లస్ ధరలు అన్నీ కూడా పెరిగాయి.

మారుతి సెలెరియో మరియు బ్రెజ్జాలను కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్డేట్ చేసిన తరువాత.. ఆల్టో కే10 కారులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రవేశపెట్టింది. ధరలను కూడా ఈ సందర్భంగానే ప్రవేశపెట్టింది. కాబట్టి ఆల్టో కే10 ఎంట్రీ లెవెల్ మోడల్ ధరలు రూ. 14000, మిగిలిన వేరియంట్ల ధరలు రూ. 6000, రూ. 10000, రూ. 16000 పెరిగాయి.

డిజైన్

మారుతి సుజుకి ఆల్టో కే10 డిజైన్ మునుపటి మాదిరిగానే.. సాధారణంగా, ఆకర్షణీయంగా ఉంది. డిజైన్ మరియు ఇంజిన్ వంటి వాటిలో ఎలాంటి అప్డేట్స్ లేదు. కాబట్టి ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి డిజైన్ అప్డేట్స్ ఎవరూ ఆశించాల్సిన అవసరం లేదు.

ఫీచర్స్

డిజైన్ మాదిరిగానే.. ఫీచర్లలో కూడా ఎటువంటి అప్డేట్స్ లేదనే తెలుస్తోంది. ఎయిర్‌బ్యాగ్స్ మాత్రం కాకుండా.. చెప్పుకోదగ్గ కొత్త ఫీచర్స్ కూడా లేదు. అదే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టం, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

సేఫ్టీ ఫీచర్స్

కంపెనీ ఇప్పుడు మారుతి ఆల్టో కే10 కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు.. రియర్ పార్కింగ్ సెన్సార్లు, 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్స్, లగేజ్ రిటెక్షన్ క్రాస్‌బార్లు మొదలైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

2000 సంవత్సరంలో భారతదేశంలో బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ వచ్చినప్పటి నుండి మారుతి సుజుకి ఆల్టో 46 లక్షలకు పైగా అమ్ముడైంది. ఆల్టో కె10 కొనుగోలుదారులలో 74 శాతం మంది తొలిసారి కొనుగోలు చేస్తున్నవారేనని కంపెనీ సీనియర్ మార్కెటింగ్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ అన్నారు.

ఇంజిన్ డీటెయిల్స్

అప్డేటెడ్ మారుతి సుజుకి ఆల్టో కే10 కారులో ఎలాంటి మెకానికల్ అప్డేట్స్ లేదు. కాబట్టి ఇందులో అదే 1.0 లీటర్ త్రీ సిలిండర్ కే10 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 Bhp పవర్, 89 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది CNG రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది 56 Bhp పవర్, 82 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే పొందుతుంది. ఇది కొంత ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

మారుతి ఆల్టో సేల్స్

ప్రారంభంలో చెప్పుకున్నట్లు ఇండియన్ మార్కెట్లో.. మారుతి సుజుకి యొక్క ఆల్టో కార్లకు బలే డిమాండ్ ఉంది. ఈ కారు గతంలో మారుతి 800 పేరుతో పరిచయమైంది. ఆ తరువాత కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందుతూ.. ఇప్పుడు ‘ఆల్టో కే10’గా అమ్మకానికి ఉంది. మొత్తం మీద ఈ కారును 46 లక్షల కంటే ఎక్కువమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడో తెలుసా?.. అంతకంటే ముందు ఏం జరుగుతుందంటే..

తక్కువ ధర, ధరకు తగిన ఫీచర్స్ కలిగిన మారుతి ఆల్టో కే10.. సేఫ్టీలో వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లో అడుగుపెట్టిన అప్డేటెడ్ ఆల్టో కే10.. కావలసినన్ని సేఫ్టీ ఫీచర్స్ పొందింది. కాబట్టి ఇది సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంటుంది. దీంతో ఇది గొప్ప అమ్మకాలను పొందే అవకాశం కూడా ఉందని సమాచారం. అయితే రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది. దాని ప్రత్యర్థులను అధిగమించగలదా?.. ప్రజలను ఆకర్శించగలదా? అనే విషయా తెలియల్సి ఉంది.

మారుతి ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కార్ల విభాగం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సమయంలో.. మారుతి సుజుకి తన గ్రాండ్ విటారాను, ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయనుంది. ఇది బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది తప్పకుండా దేశీయ విఫణిలో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఇది ఒక సింగిల్ ఛార్జితో 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Comment