ఎనిమిదేళ్ళకు మొదటి బిడ్డకు జన్మనించిన ప్రముఖ నటి: ఫోటోలు చూశారా?

Actress Sagarika Ghatge Blessed With Baby Boy: ప్రముఖ నటి సాగరికా ఘట్గే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త మరియు క్రికెటర్ ‘జహీర్ ఖాన్’ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఫోటోలను షేర్ చేశారు. తమ కుటుంబంలోకి చేరిన కొత్త వ్యక్తికి స్వాగతం అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రేమ, కృతజ్ఞత మరియు దేవుని ఆశీర్వాదముతో.. లిటిల్ బేబీ బాయ్ ఫతేసిన్హ్ ఖాన్‌కు స్వాగతం చెబుతున్నామని జహీర్ ఖాన్ వెల్లడించారు. ఎనిమిది సంవత్సరాల తరువాత.. మగబిడ్డ పుట్టాడని సంతోషకరమైన వార్తను నటి సాగరికా ఘట్గే కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. బిడ్డ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

జహీర్ ఖాన్ బిడ్డను చేతులతో పట్టుకుని ఉండటం, సాగరిక తన చేతులను భర్త భుజాల మీద వేసి ఉండటం ఇక్కడ ఫోటోలలో కనిపిస్తుంది. నటి ప్రెగ్నెన్సి తరువాత పెద్దగా బయట కనిపించలేదు.. కానీ బిడ్డ పుట్టిన తరువాత ఆ వార్తను సంతోషంతో ప్రకటించారు. నిజానికి ఆమె ప్రెగ్నెన్సీ గురించి చాలామందికి తెలియదు.

సెలబ్రిటీల శుభాకాంక్షలు

బిడ్డ పుట్టిన వార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ సెలబ్రిటీ జంటకు.. అభిమానులు మాత్రమే కాకుండా, నటి అతియా శెట్టి మరియు నటులు అంగద్ బేడీ, హుమా ఖురేషీ, క్రికెటర్ సురేష్ రైనా, నటి డయానా పెంటీ వంటి ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

సాగరిక మరియు జహీర్ గురించి

క్రికెటర్ జహీర్, నటి సాగరిక 24 ఏప్రిల్ 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తరువాత వీరి పెళ్లి నవంబర్ 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత సంతోషంగా కాలం గడిపారు. కాగా ఇప్పటికి మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి ఇద్దరు ముగ్గురవ్వడంతో అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున అభినందనలు చెబుతున్నారు.

Also Read: కొత్త కొరు కొన్న పుష్ప 2 కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ: కారు రేటెంతో తెలుసా?

కెరీర్ విషయానికి వస్తే.. సాగరిక 2007లో షారుక్ ఖాన్ సరసన చెక్ దే! ఇండియా సినిమాతో బాలీవుడ్ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఫాక్స్, మైల్ నా మిలే హమ్, రష్ మరియు ఇరాదా వంటి అనేక సినిమాల్లో నటించింది. ఈమె జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. సాగరిక మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. రియాలిటీ షో, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ సీజన్ 6లో కూడా ఆమె పాల్గొంది.

జహీర్ ఖాన్ విషయానికి వస్తే.. మహారాష్ట్రకు చెందిన ఈయన గొప్ప పేసర్. 2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈయన.. 14 సంవత్సరాల కెరీర్‌లో 92 టెస్టులు, 17టీ 20 మ్యాచెస్ మరియు 200 వన్డేలు ఆడారు. తనదైన రీతిలో ఆడుతూ.. ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత.. ఐపీఎల్ ఆడారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఈయన సారథ్యంలో టీమ్ 7 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లు గెలిచారు.

 

View this post on Instagram

 

A post shared by Sagarika Z Ghatge (@sagarikaghatge)

Leave a Comment