నీటి ఆవిరితో నడిచే ట్రైన్ నుంచి వందే భారత్ వరకు: 172 ఏళ్ల ఇండియన్ రైల్వే..

Indian Railways 172nd Anniversary: ప్రతి రోజూ కొన్ని వందల కిలోమీటర్లకు ప్రయాణిస్తూ.. ఎంతోమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఇండియన్ రైల్వే గురించి అందరికి తెలుసు. కానీ దీనికి ఒక శతాబ్దం కంటే ఎక్కువ చరిత్ర ఉందని చాలా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో భారతీయ రైల్వే ఎప్పుడు ప్రారంభమైంది? దీని చరిత్ర మరియు ఎవల్యూషన్ వంటి ఆసక్తికరమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం.

మొదటి రైలు ఎప్పుడంటే?

1853 ఏప్రిల్ 16న బోరి బందర్ నుంచి మహారాష్ట్రలోని థానే వరకు మొదటి రైలు నడిచింది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అనే చెప్పాలి. అప్పటి వరకు భారతదేశంలో రైలు వ్యవస్థ లేనేలేదు. ఆ తరువాత అనేక మార్పులు వచ్చాయి. ఆవిరితో నడిచిన రైలు.. ఈ విద్యుత్‌తో నడుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైలు పరిణామ క్రమం ఎంత వరకు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద భారతదేశపు మొదటి రైలు ప్రయాణం ప్రారంభమై 172 సంవత్సరాలు పూర్తయ్యాయి.

12 లక్షల మంది ఉద్యోగులు

ఇండియన్ రైల్వే అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతోంది. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ఏకంగా 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థ భారతీయ రైల్వే దేశంలో రెండో స్థానంలోనూ.. ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రస్తుతం 13000 ప్యాసింజర్ ట్రైన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

భారతీయ రైల్వే.. రోజూ లెక్కకు మించిన ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరుస్తూ.. ఇతరత్రా సేవలను కూడా అందిస్తోంది. కొన్ని నివేదికలు ప్రకారం ఇండియన్ రైల్వే రోజువారీ సంపాదన 400 కోట్ల రూపాయలు అని అని తెలుస్తోంది. 2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో భారతీయ రైల్వే ఆదాయం సుమారు రూ. 2.65 లక్షలు కావడం గమనార్హం.

ఇండియన్ రైల్వే పరిణామ క్రమం

19వ శతాబ్దంలో లేదా 1853 – 1924 మధ్య ఆవిరితో నడిచే ట్రైన్ ప్రారంభమైంది. ఆ తరువాత 1925 నుంచి 1950 మధ్య కాలంలో మొట్టమొదటి విద్యుత్ (మొదటి ఎలక్ట్రిక్ ట్రైన్ బొంబాయిలో ప్రారంభమైంది) రైలు ప్రారంభమైంది. ఆ సమయంలో లోకోమోటివ్ మరియు కోచ్ తయారీ యూనిట్లు స్థాపించబడ్డాయి.

Also Read: ఒక్క యాప్.. ఆధార్ కార్డుతో పని లేదు: స్కాన్ చేస్తే డీటైల్స్ వచ్చేస్తాయ్

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 నుంచి 1983 మధ్య కాలంలో రైల్వే వ్యవస్థను జాతీయం (1951లో) చేసారు. ఈ సమయంలో ఇండియన్ రైల్వే మరింత విస్తృతమైంది. 1984 తరువాత హైస్పీడ్ ట్రైన్స్ పుట్టాయి. ప్రస్తుతం వన్డే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు మెట్రో రైల్ వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. రైలు వ్యవస్థ పూర్తిగా అప్డేట్ అయింది. జీరో ఉద్గారాలే లక్ష్యంగా ప్రస్తుతం ఇండియన్ రైల్వే ముందుకు సాగుతోంది.

రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్

172 ఏళ్ల ఇండియన్ రైల్వే.. ఆవి యంత్రాలతో నడిచిన రైలు నుంచి వందే భారత్ వరకు, కాగితం టికెట్స్ నుంచి కాగిత రహిత టికెట్స్ వరకు. భారతీయ రైల్వే చాలా అభివృద్ధి చెందింది. జాతికి జీవనాధారమైందని.. రైల్వే మంత్రిత్వ శాఖ.. ఇండియన్ రైల్వే 172 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.

Leave a Comment