శుక్రవారం (18 ఏప్రిల్): ఈ రాశివారు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది

Daily Horoscope in Telugu 18th April 2025 Friday: శుక్రవారం (18 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణ పక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..

మేషం

చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడి వాతావరణం. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు. దైవ చింతన పెరుగుతుంది.

వృషభం

చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.

మిథునం

ఇంటాబయట అనుకూల ప్రతికూల వాతావరణం. నిరుద్యోగుల ప్రయత్నాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. వ్యాపారంలో లాభాలు అనుకున్న విధంగా సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, అధికారులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితం లభించదు. చేప్పట్టిన పనులలో నిరాశ కనిపిస్తుంది.

కర్కాటకం

ముఖ్యమైన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆశించిన లాభాలు లభిస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిది.

సింహం

శుభకార్యాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెడతారు. నిరుద్యోగులకు శుభయోగం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య

అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందదు. సన్నిహితులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులు కూడా అనుకున్న విధంగా ముందుకు సాగవు. ఉద్యోగ, వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

తుల

బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగంలో కొంత ప్రతికూల వాతావరణం. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో కూడా ఆశించిన లాభాలు ఉండవు. శుభయోగం ముందుంది.

వృశ్చికం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయం కొంత లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ధనుస్సు

దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి సరైన సమయం. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది.

మకరం

ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా, ఒత్తిడిగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. వ్యాపారాలు కొంత నత్త నడకన ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు పట్టు వదలకుండా శ్రమించాలి.

కుంభం

మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యమైన పనులలో శ్రమ పెరిగినప్పటికీ.. కొంత నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆర్ధిక పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి.

మీనం

దీర్ఘకాలిక మొండి బకాయిలు వసూలవుతాయి. ఇంటాబయట ప్రతికూల పరిస్థితి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తులకు సంబంధించిన క్రయ, విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగంలో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తొందరపాటు వద్దు.

గమనించండి: రాశిఫలాలు గ్రహ స్థితి గతుల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. అయితే వీటి శాస్త్రీయమైన లేదా సాంఘిక ఆధారాలు ఉండవు. కాబట్టి రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి.

Leave a Comment