శనివారం (19 ఏప్రిల్): ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Daily Horoscope in Telugu 19th April 2025 Saturday: శనివారం (19 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే..

మేషం

ఇంటాబయట అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఉద్యోగంలో అదనపు పనిభారం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం

ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాలు చేపట్టడానికి ఆలోచిస్తారు. ఉద్యోగులకు శుభయోగం, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి.. మునుపటి కంటే బాగుంటుంది.

మిథునం

కీలక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారంలో లాభాలు అంతగా కలిసిరావు. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సన్నిహితులతో వివాదాలు. వివాదాలు దూరంగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. తొందరపాటు వల్ల నష్టాలు జరుగుతాయి.

కర్కాటకం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు శుభయోగం. పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.

సింహం

శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. బంధు, మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. తొందరపాటు వద్దు, ఉద్యోగస్తులకు మంచి కాలం ఉంది. ఆర్ధిక పరిస్ధితి బాగుంటుంది.

కన్య

ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ.. కొంత జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు ఎదురవుతాయి. వెనుకడుగు వేయకుండా శ్రమిస్తే.. తప్పకుండా విజయం మీదే అవవుతుంది.

తుల

దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వ్యాపారంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అయినవాళ్లతో తగాదాలు. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా వస్తుంది, కొంత వేచిచూడాలి.

వృశ్చికం

సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తొందరపాటు పనికిరాదు. నిరుద్యోగుల కృషికి తగిన ఫలితం లభిస్తుంది.

ధనుస్సు

నిరుద్యోగులకు శుభయోగం, మీ శ్రమకు తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. ఇంటాబయట అనుకూల వాతావరణం. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం పొందుతారు. ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మంచి సమయం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ చింతన పెరుగుతుంది.

మకరం

ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. ప్రయాణంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు చేతికి అందదు. సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు.

కుంభం

చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. అవసర ఖర్చులు ఉన్నాయి, ఖర్చుల విషయంలో దుబారా పనికిరాదు. వృత్తి వ్యాపారాలు అంతగా కలిసిరావు. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి.

మీనం

సంఘంలోని ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధాత్మిక చింతన పెరుగుతుంది.

గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. అంతే కాకుండా ఈ ఫలితాలు గ్రహాల స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఫలితాలలో మార్పులు జరగవచ్చు. వీటన్నింటినీ పాఠకులు దృష్టిలో ఉంచుకోవాలి.

Leave a Comment