బ‌ర్త్‌డేకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన భార్య – ఆనందంతో తేలిపోయిన భర్త (వీడియో)

Wife Surprises With Mahindra Thar Roxx Gift To Husband Birthday: భార్యాలకు భర్తలు గిఫ్ట్స్ ఇవ్వడం సాధారణమే.. అయితే అప్పుడప్పుడు భార్యలు కూడా వారి ప్రేమను వ్యక్తపరచడానికి భర్తలకు నచ్చిన వస్తువులను లేదా వాహనాలను గిఫ్ట్ ఇస్తూ ఆశ్చర్య పరుస్తుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అర్పిత అభిషేక్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోను గమనించినట్లయితే.. ఇందులో భార్య, తన కుమార్తెతో కలిసి కియా సెల్టోస్ కారులో వస్తుంది. కారు ఆగిన తరువాత.. భర్త కళ్ళకు గంతలు కట్టి, అప్పటికే సిద్ధం చేసి ఉంచిన గిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ తరువాత కాళ్ళ గంతలు తీసేసి.. గిఫ్ట్ ఏమిటో ఊహించమని చెబుతుంది. అప్పుడు భర్త అయోమయంలో పడతాడు.

గిఫ్ట్ ప్యాక్ దగ్గరకు వెళ్లి, దాన్ని ఓపెన్ చేయగానే.. మహీంద్రా రోక్స్ (Mahindra Roxx) కనిపిస్తుంది. ఒక్కసారిగా భర్త ఆశ్చర్యపోతాడు. ప్రేమతో భార్యను కౌగిలించుకుని, కుమార్తెను పట్టుకుంటాడు. తరువాత కుమార్తె.. పాదాలను ఎర్రటి ద్రవం వంటిదానిలో ముంచి, కారు బంపర్ మీద ముద్ర వేసాడు. ఆ తరువాత ఫోటోలకు ఫోజులిచ్చి.. భార్యతో కలిసి, కారును డ్రైవ్ చేసుకుంటూ.. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ వీడియో నెట్టింట్లో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మహీంద్రా రోక్స్

రోక్స్ అనేది.. మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్. వీడియోలో కనిపించే మోడల్ రోక్స్ ఏఎక్స్7ఎల్ అని తెలుస్తోంది. ఇది ఈ ఎస్యూవీ టాప్ ఎండ్ మోడల్. ఏఎక్స్7ఎల్ వేరియంట్ రియర్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధరలు రూ. 19.19 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఫోర్ వీల్ డ్రైవ్ డీజిల్ వేరియంట్ ధరలు రూ. 23.09 లక్షల వరకు ఉంటుంది.

చూడటానికి సాధారణ మహీంద్రా థార్ మాదిరిగా ఉన్న రోక్స్.. పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ మరియు 18 ఇంచెస్ స్టీల్ వీల్స్ పొందుతుంది. 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం కలిగిన ఈ కారు పుష్ బటన్ స్టార్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫాబ్రిక్ సీట్లు, రియర్ ఏసీ వెంట్స్, సీట్ బెల్ట్, 60:40 స్ప్లిట్ రియర్ సీటు, USB ఛార్జింగ్ పోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్ కూడా పొందుతుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఏడీఏఎస్ లెవెల్ 2 వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో నిక్షిప్తమై ఉన్నాయి.

Also Read: లేటెస్ట్ హోండా డియో స్కూటర్.. ఇప్పుడు మరింత కొత్తగా: ధర ఎంతో తెలుసా?

ఇక చివరగా ఇంజిన్ విషయానికి వస్తే.. మహీంద్రా థార్ రోక్స్ 2.0 లీటర్ పెట్రోల్ (162 హార్స్ పవర్ & 330 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ (152 హార్స్ పవర్ మరియు 330ఎన్ఎమ్ టార్క్) ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ 6 స్పీడ్ ఆటోమాటిక్ మరియు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. కాబట్టి మంచి పనితీరును అందిస్తాయి.

 

View this post on Instagram

 

A post shared by Arpitha Abhishek (@arpithabhishek)

Leave a Comment