ఆదివారం (20 ఏప్రిల్): 12 రాశుల ఫలితాలు ఇలా..

Daily Horoscope in Telugu 20th April 2025 Sunday: ఆదివారం (20 ఏప్రిల్). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు. ఈ రోజు రాశిఫలాలు గమనిస్తే..

మేషం

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవవుతాయి. సన్నిహితుల సహకారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగులకు శుభయోగం. తొందపాటు పనికిరాదు.

వృషభం

అనవసర ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం విషయంలో తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. దైవ చింతన పెరుగుతుంది.

మిథునం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల ద్వారా లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, సన్నిహితులతో సమయం గడుపుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంది.

కర్కాటకం

కీలక వ్యవహారాల్లో విజయం మీదే. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో పురోగతి. పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థికి కూడా మెరుగ్గా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

సింహం

బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సన్నిహితులతో సమయం గడుపుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు వేగవంతం అవుతాయి. లాభాలను గడిస్తారు. కీలక వ్యవహాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అన్ని విషయాల్లోనూ అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

కన్య

చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా.. ధైర్యంగా పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఉద్యోగాల్లో పదోన్నతి. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పెద్దల సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి.

తుల

ఇంటాబయట అనుకూల వాతావరణం, వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. నిరుద్యోగులకు శుభయోగం.. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

వృశ్చికం

ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దీర్ఘకాలిక తగాదాలు ముగుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు, సన్నిహితుల నుంచి ఆర్ధిక సహాయం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. కొంత జాగ్రత్త వహించడం ఉత్తమం.

ధనుస్సు

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఊహకందని లాభాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దైవ చింతన పెరుగుతుంది.

మకరం

ఉద్యోగులకు శుభయోగం, మీ పనికి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాతో.. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు.

కుంభం

ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. కీలక వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం

విలువ వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు.ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సొంత ఆలోచనలు ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. నూతన కార్యక్రమాల్లో అవరోధాలు తొలగిపోతాయి. దైవ చింతన పెరుగుతుంది.

గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఫలితాలు గ్రహాల స్థితిగతుల ఆధారంగా మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. పాఠకులు ఈ విషయాన్ని గమనించాలి.

Leave a Comment