మంగళవారం (22 ఏప్రిల్): నేటి 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

మంగళవారం (22 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణపక్షం, తిథి: నవమి మధ్యాహ్నం 1:49 నుంచి 22 మధ్యాహ్నం 1:03 వరకు తరువాత దశమి. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు.

మేషం

కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

వృషభం

ఇంటాబయట సానుకూల వాతావరణం. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సన్నిహితులతో కాలం గడుపుతారు. కీలక వ్యవహారాల్లో విజయం మీదే. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం

ఆర్థికపరమైన సమస్యలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో కలహాలు. ప్రయాణంలో ఇబ్బందులు కలిగే అవకాశం. వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగంలో అధిక ఒత్తిడి, ఋణప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా సాగినప్పటికీ.. ఓపికగా ఎదురు చూస్తే విజయం సాధిస్తారు.

కర్కాటకం

నిరుద్యోగులకు శుభయోగం, నూతన పరిచయాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. దైవ చింతన పెరుగుతుంది.

సింహం

శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలకు సన్నిహితుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ.. సానుకూలంగా ముందుకు సాగుతారు. పెద్దల సలహాలు లాభాలను కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి.

కన్య

నిరుద్యోగులకు ఉద్యోగావకాశం లభిస్తుంది. ముఖ్యమైన సమస్యలు తీరిపోతాయి. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుస్తాయి. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. దైవ చింతన పెరుగుతుంది.

తుల

సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వృత్తి, వ్యాపారంలో లాభాలు. సన్నిహితులతో సఖ్యంగా మెలుగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగంలో చికాకులు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కీలక వ్యవహారాలు అనుకున్న వేగంగా ముందుకు సాగవు. ఆర్ధిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొందరపాటు వద్దు, అలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాలు ఉన్నాయి.

ధనుస్సు

ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం, ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇంటాబయట ప్రతికూల వాతావరణం. ఎట్టి పరిస్థితుల్లో అయినా తొందరపాటు పనికిరాదు.

మకరం

ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండవు. ఉద్యోగంలో అదనపు పనిభారం పెరుగుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. సంయమనం చాలా అవసరం. దైవ చింతన పెరుగుతుంది. సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. వేచి చూడాలి.

కుంభం

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ పనికి తగిన ఫలితం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు లాభాలను చేకూరుస్తాయి. జాగ్రత్త వహించడం మంచిది.

మీనం

అకస్మిక ఖర్చులు ఉన్నాయి, అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందదు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. పనులు మందకోడిగా సాగుతాయి.

గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవహగాన కోసం మాత్రమే. దీనికి ఎలాంటి పటిష్టమైన లేదా సాంకేతిక ఆధారాలు లేవు. ఇది మాత్రమే కాకుండా గ్రహాల స్థితిగతుల ఆధారంగా రాశిఫలాలు మారే అవకాశం ఉంది. పాఠకులు దీనిని గుర్తుంచుకోవాలి. దైవారాధన వల్ల తప్పకుండా శుభం కలుగుతుంది.

Leave a Comment